విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఆర్చరీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను కోరారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు చూడాలని పేర్కొన్నారు. పాఠశాలను దత్తత తీసుకున్నందున దశలవారీగా పాఠశాలకు వచ్చి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి కలెక్టర్కు స్వాగతం పలికారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అంబర్ సింగ్, సర్పంచ్ సంజీవ్, తహసిల్దార్ గోవర్ధన్, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post