విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 06–05–2022

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీశ్

పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించిన కలెక్టర్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు  పరీక్షలు ప్రశాంత వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని… ఈ విషయంలో విద్యార్థులు సైతం ఎలాంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని నాచారంలోని అర్భనే జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరీశ్ ఆకస్మికంగా వెళ్ళారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నీటి వసతిని తనిఖీ చేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు.  దీంతో పాటు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించనందున విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్ నిరోధించడానికి ప్రత్యేక స్వ్కాడ్ టీమ్లు,  పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు సెంటర్ లొకేటర్ యాప్ను కూడా అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 1,06,730 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ హరీశ్ వివరించారు. అలాగే  ఫ్లయింగ్ స్వ్కాడ్లు, సిట్టింగ్ స్వ్కాడ్లు, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా జనరల్ పరీక్షలకు 53,565 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,053 విద్యార్థులు మొత్తం 54,618 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్లో 52,183 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 994 మంది మొత్తం 53,177 పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారని మిగిలిన జనరల్లో 1,382 మంది, ఒకేషనల్లో 59 మంది మొత్తం 1,441 మంది గైర్హాజరైనట్లు జిల్లా అధికారి కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కిషన్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post