విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

పాఠశాల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌, యునిసెఫ్‌, ఇంక్వి-లాబ్‌ ఫౌందేషన్‌ సంయుక్తంగా స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌-2021 నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థినీ, విద్యార్థుల ఆలోచనలను స్వీకరించి ఉత్తమ మైన వాటిని ఎంపిక చేసి ఆచరణ రూపం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని, జిల్లాలోని లక్షైట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు టాప్‌ 7 స్థానం పొందారని, కొనసాగింపుగా ఈ సంవత్సరం సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు మరింత మెరుగైన ఆవిష్కరణలతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కస్తూరిభా, ఆదర్శ పాఠశాలలు, బి.సి., ఎస్‌.సి., ఎస్‌.టి., మైనార్టీ వెల్చేర్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, సంబంధిత వివరాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 28వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడిని స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ఇన్‌చార్జి టీచర్‌గా నియమించి వివరాలు పొందుపర్పాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఈ నెల 30 నుండి నవంబర్‌ 12వ తేదీ మధ్య ఆన్‌లైన్‌ విధానంలో కార్యక్రమంపై శిక్షణ ఉంటుందని, నవంబర్‌ 18 నుండి 19వ తేదీ వరకు ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ కోర్సు, రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయడం జరుగుతుందని, 22 నుండి డిసెంబర్‌ 17వ తేదీ వరకు విద్యార్థుల ఆన్‌లైన్‌ కోర్చు, ఆలోచన నమోదు, డిసెంబర్‌ 17 నుండి ౩1వ తేదీ వరకు మూల్యంకనం, జనవరి 2, 2022 నుండి 25వ తేదీ వరకు జిల్లా స్థాయి ఫ్రొటోటైపింగ్‌ క్యాంపు, 27 నుండి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి ప్రదర్శన, ఫిబ్రవరి 5 లేదా 6 తేదీలలో తుది ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం కార్యక్రమ సంబంధిత గోడప్రతులను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్‌. వెంకటేశ్వర్లు, సెక్టోరల్‌ అధికారి స్టర్‌ అలీఖాన్‌, జిల్లా సైన్స్‌ అధికారి మధు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

 

Share This Post