విద్యార్థుల అవసరాలకనుగుణంగా మాత్రమే మన ఊరు- మనబడి మనబస్తీ – మనబడి పనులు అంచనాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

మే.06 ఖమ్మం

విద్యార్థుల అవసరాలకనుగుణంగా మాత్రమే మన ఊరు- మనబడి మనబస్తీ – మనబడి పనులు అంచనాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్యా: రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మన ఊరు- మనబడి, మనబస్తీ- మనబడి పనుల అంచనాలను పాఠశాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వారి అవసరాల మేరకు మాత్రమే పనులు చేపట్టేందుకు అంచనాలను సమర్పించాలని, ప్రస్తుతం అవసరం లేనటువంటి పనులను మినహాయించాలని కలెక్టర్ సూచించారు. పూర్తి శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలోనే కొత్త భవనాన్ని ప్రతిపాధించాలని, అవసరం లేనిచోట అదనపు తరగతి గదులను ప్రతిపాదించవదన్నారు. విద్యార్థుల తరగతి గదిలో కాకుండా చెట్ల క్రింద విద్యాబోధన జరిగే పాఠశాలల్లో తప్పనిసరిగా అదనపు తరగతి గదులను ప్రాతిపాదించాలని, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, డైనింగ్ హాల్ తదితర పనులకు సంబంధించి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఆవశ్యకతనుబట్టి మాత్రమే పనులకు అంచనాలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే సమర్పించిన అంచనాలు బడ్జెట్ కేటాయింపులకంటే ఎక్కువ రెట్లు ఉన్నాయని, ఇంజనీరింగ్, విద్యా శాఖాధికారులు మరోసారి అంచనాలను సరిచూసుకొని క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి అవసరాల మేరకు మాత్రమే పనులకు అంచనాలను తిరిగి సమర్పించాలని కలెక్టర్. సూచించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ శాఖల ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, హేమలత, శ్రీనివాసరావు, మండల విద్యాశాఖాధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post