విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా పూర్తి చేయాలి కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

     జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లను  వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను   ఆదేశించారు.
      గురువారం కలెక్టర్ కార్యాలయంలో ని ఉదాయాదిత్య భవన్ లో  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ,బి.సి.ఆ భివృద్ధి శాఖగిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు,కళాశాలల ప్రిన్సిపాల్స్ తో  కళాశాల స్థాయి ఎస్.సి.,ఎస్.టి.,బి.సి.,మైనార్టీ సంక్షేమ శాఖ ల ద్వారా ఉపకార వేతనంల పై నిర్వహించిన  సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు మొత్తంగా  (236) ఉన్నాయని తెలిపారు. ఇందులో (10649) మంది ఎస్సి విద్యార్థులు,ఎస్.టి.విద్యార్థు లు (5830),మైనార్టీ విద్యార్థులు (3039) మరియు బి. సి విద్యార్థులు (27886) మొత్తం విద్యార్థులు (47,404)ఉపకార వేతనాలు పొందుటకు అర్హులని అన్నారు.  వీరిలో ఇప్పటివరకు (7,886)మంది విద్యార్థులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపారు.మొదటి సంవత్సరం లో చేరిన విద్యార్థులు,ఇప్పటికే చదువుచున్న రెండవ,ఇతర సంవత్సరం విద్యారులు రెన్యువల్,పెండింగ్ స్కాలర్ షిఫ్ లకు సంబంధించి ఆధార్  థేంటి కేషన్ పూర్తి చేసి  మిగిలిన (39,518) విద్యార్థుల రిజిస్ట్రేషన్లను  వేగవంతంగా పూర్తిచేయాలని,హార్డ్ కాపీ లు సంబంధిత సంక్షేమ శాఖల అధికారులకు అంద చేయాలని  కళాశాలల ప్రిన్సిపాల్ లకు  సూచించారు. అర్హులైన విద్యార్థులకు  బోనఫైడ్ సర్టిఫికెట్ లు,  ఆధార్ కార్డు నెంబర్లతో కంప్యూటర్లలో రిజిస్ట్రేషన్ లను  పూర్తిచేయాలని అన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి  విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్ లకు సూచించినా రు. మరియు ఉపకారవేతనాల రిజిస్ట్రేషన్ల పక్రియ కు సంబంధించి సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సల్మాభాను,జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకటయ్య,జిల్లా బి. సి.సంక్షేమ అభివృద్ధి అధికారి కృష్ణ వేణి,జిల్లా  మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, సంక్షేమ శాఖ ల అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్ లు ,  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా పూర్తి చేయాలి
కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై సమీక్షా సమావేశంలో
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

Share This Post