విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలి:: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16: విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కళాశాల, పాఠశాల స్థాయి ఉపకార వేతనములపై అధికారులు, కళాశాల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 817 పోస్ట్ మెట్రిక్, 3 వేల 832 ప్రి మెట్రిక్ ఉపకార వేతనాలు పొందే అర్హతగల విద్యార్థినీ విద్యార్థులు వున్నారన్నారు. అర్హత గల వారందరు ఉపకార వేతనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం మంజూరుకు కులం, ఆదాయం ధృవీకరణలు తప్పనిసరి కావున, సంబంధిత మండల తహశీల్దార్లు ధృవీకరణల జారీకి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక సదరన్ క్యాంపు ఏర్పాటుచేసి, ధృవీకరణలు ఇవ్వాలన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని విద్యార్థులందరికి ఖాతాలు ఇచ్చే విధంగా ఎల్డిఎం బ్యాంకులకు సూచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు పాఠశాల నేషనల్ స్కాలర్ షిప్ పోర్ట్ లో నమోదవ్వాలని, ప్రతి సంవత్సరం కెవైసి ఫామ్ సమర్పించాలని ఆయన తెలిపారు. కళాశాల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని, అధికారుల సమన్వయంతో లక్ష్యం పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి మోహన్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి, ఎల్డిఎం రంగారెడ్డి, మండల విద్యాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కాంప్లెక్స్ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post