విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు,పెండింగ్ దరఖాస్తులు వేగవంతంగా పూర్తి చేయాలి కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

  జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లను,పెండింగ్ స్కాలర్ షిప్ దరఖాస్తు లను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  వి.చంద్ర శేఖర్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను   ఆదేశించారు.
     శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ లో   కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులందరికీ  ఉపకార వేతనాలు అందేలా కృషి చేయాలని,      కళాశాలల వారిగా పెండింగ్లో ఉన్న దరఖాస్తు లను వెంటనే సబ్మిట్ చేయాలని తెలిపారు.ఉపకార వేతనాలు విద్యార్ధులకు అందక పొతే విద్యార్థులు నష్ట పోతారని తెలిపారు. జిల్లా కలెక్టర్   సమావేశం నిర్వహించిన తర్వాత   రినిస్ట్రేషన్ లు పెరిగాయని, పెండింగ్ లో ఉన్న మిగతా వాటిని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్ లు కూడా నిర్వహించి దరఖాస్తులు సంబంధిత సంక్షేమ అభివృద్ధి శాఖ ల అధికారులకు పంపాలని అన్నారు.  విద్యార్ధులకు ఆదాయ,కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ లు తీసుకొనుటకు ఒక్కొక్క ధ్రువీకరణ పత్రం కు మీ సేవా కేంద్రం నిర్వాహకులు 45 రూ.లు కంటే ఎక్కువ తీసుకో రాదని , ఒక వెళ అధికంగా వసూలు చేస్తే పరిష్కారం కాల్ సెంటర్ 1100 కు  ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కొరినారు.
ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, మైనారిటీఅధికారి రాజ్, కుమార్,జిల్లా బి.సి.సంక్షేమ అభివృద్ధి అధికారిణి కృష్ణవేణి  , జిల్లా విద్యా శాఖ అధికారి భిక్ష పతి షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ డి.డి.  సల్మా భాను,జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటయ్య  వివిధ కళాశాల ప్రిన్సిపాల్ లు, హాస్టల్ వెల్ఫెర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు,పెండింగ్ దరఖాస్తులు వేగవంతంగా పూర్తి చేయాలి
కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై సమీక్షా సమావేశంలో
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

Share This Post