విద్యార్థుల కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన గాంధీ సినిమా జిల్లాలోని సినిమా థియేటర్లలో మంగళవారం నుండి ప్రదర్శించబడుచున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 9:

విద్యార్థుల కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన గాంధీ సినిమా జిల్లాలోని సినిమా థియేటర్లలో మంగళవారం నుండి ప్రదర్శించబడుచున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్, పోలిస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఖమ్మం నగరంలోని కేపిఎస్ ఆదిత్య, వినోద, ఏషియన్ శ్రీనివాస, ఏషియన్ సాయిరాం థియేటర్లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సినిమా ప్రదర్శనను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. కలెక్టర్, పోలిస్ కమీషనర్లు శ్రీనివాసా, సాయిరాం దియేటర్లలో విద్యార్థులతో సినిమా చూసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల కోసం ఈ నెల 9 నుండి 11 వరకు, తిరిగి 16 నుండి 21 వరకు 9 రోజుల పాటు గాంధీ సినిమాను జిల్లాలోని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 92 వేల మంది విక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. ప్రతి స్కూల్, థియేటర్ ను మ్యాచింగ్, బ్యాచింగ్ చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఖమ్మం పట్టణంలో కేపిఎస్ ఆదిత్య, తిరుమల, వినోద, ఏషియన్ శ్రీనివాస, ఏషియన్ సాయిరాం, శ్రీ సుందర్ మ్యాక్స్, సత్తుపల్లి లోని శ్రీనివాస, శ్రీ బాలాజి, సాయిబాలాజీ, మధిర లోని వాసవి, శ్రీ లక్ష్మి శ్రీనివాస, శాంతి, వైరా లోని వాసవి, బోనకల్ లోని శ్రీ దుర్గ, నేలకొండపల్లి లోని శ్రీ బాలాజీ, సింగరేణి లోని రోనీచా కళామందిర్ థియేటర్లలో సినిమా ప్రదర్శించబడుతుందని అన్నారు. మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం వుందని, గాంధీ సినిమా ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏసిపిలు ఆంజనేయులు, రమేష్, ఖమ్మం అర్బన్, రూరల్ తహసిల్దార్లు శైలజ, సుమ, అధికారులు తదితరులు వున్నారు.

Share This Post