విద్యార్థుల చదువుతొనే గ్రామాభివృద్ధి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 04-09-2021

విద్యార్థుల చదువుతొనే గ్రామాభివృద్ధి  జిల్లా కలెక్టర్ డి హరిచందన.

నారాయణపేట మండలం   ఎక్లాస్ పూర్   గ్రామం లోని  అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఉదయం  జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఎక్లాస్ పూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసారు.  విద్యార్థులకు రోజు వారిగా ఆశావర్కర్ ల ద్వారా వైద్య పరిక్షలు చేయించాలని  సూచించారు. కరోనా సమస్య ఇంకా తొలగిపోలేదని,  ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.  విద్యార్థులు,  గర్భిణీల వివరాలను  అంగన్వాడి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు.   25 మంది విద్యార్థులు  ఉన్నారని అలాగే గర్భిణీలు 16 మంది ఉన్నారన్ని వారికి ఆకు కూరలు, కోడి గుడ్లను అందించడం జరుగుతోందని అంగన్వాడీ టీచర్ సమాధానం ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలను  సందర్శించి విద్యార్థుల కు పుస్తకాల పంపిణి పై ఆరా తీశారు.  పుస్తకాలు పంపిణీ చేయకుంటే   అందరికి పుస్తకాల పంపిణి చేయాలనీ ఉపాధ్యాయుని సూచించారు. పాటశాలలో వంటగది సక్రమ స్థితి లో లేదని గ్రామ సర్పంచ్  జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ గ్రామా పంచాయతి నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని NREGS ద్వార కూడా నిర్మాణం చేసుకోవచ్చన్ని సూచించారు.   కొన్ని తరగతి గదులలో విద్యుత్ సదుపాయలను వెంటనే ఏర్పాటు చేయాలనీ   విద్యార్థుల చదువు తొనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు.  తెలుగు బోధన జరుగుతున్న తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పుస్తకం చదివించారు.

అలాగే జిల్లా కేంద్రం లో ఉన్న 7 వార్డ్  లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని  భోజన సమయము లో ఆకస్మికంగా తనిఖి చేసి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యతను విద్యార్ధి ద్వార అడిగి తెలుసుకున్నారు. గుడ్లను అందించాలని పౌష్టిక ఆహాన్ని అందించాలని వారికీ ఎలాంటి చిన్న జలుబు జ్వరం లాంటి లక్షనలు అనిపిస్తే వెంటనే ఆశవర్కర్లను పిలిపించుకుని పరిక్ష్కలు నిర్వహించాలని సూచించారు. 7 వ వార్డ్ లో ఉన్న సఖి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న సిబ్బంది తో మాట్లాడి కుటుంబ సమస్యల పై వస్తున్న ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమం లో DWO వేణుగోపాల్, నారాయణపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, DT నారాయణ  తదితరులు పాల్గొన్నారు.

————————-

జిల్లా పౌరసంబంధల అధికారి ద్వారా జరి.

Share This Post