విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు, మన ఊరు మన బడి…జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష
” ఆకట్టుకునేలా బోధన ఉండాలి. తల్లిదండ్రుల సహకారం అవసరం*
” మన ఊరు మన బడితో పాఠశాలలు బలో పేతం*
ఉపాధ్యాయులు,వెనుక బడిన విద్యార్థులను గుర్తించాలి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి ద్వారా చేపడుతున్న పనులకు తోడు విద్యార్థులకు నాణ్య మైన విద్య అందేలా తొలిమెట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ ప్రారంబించింది అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉదయం దామరగిద్ద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలను జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మయంక్ మిట్టల్ తో కలిసి మన ఊరు మన బడి పనులను పరిీలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష దామరగిద్ద మండలం లో సుడిగాలి పర్యటన నిర్వహించి వివిధ గ్రామాలలో మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. కే జీ బీ వి పాటశాల పదవ తరగతి విద్యార్థులతో మమేకమై ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు బోర్డ్ పై భారత దేశ పటం వేసి రాజధానులను గుర్తింప చేశారు. విద్యార్థులు అందరూ 10/10 జీ పి ఏ సాధించే విధంగా చద వలన్నారు. తొలిమెట్టు కార్యక్రమం లో భాగంగా విటపుర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు, అక్కడ ఉన్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం పరిచారు. కచ్చితంగా వారానికి ముడు సార్లు గుడ్లు ఇవ్వాలి అని ఆదేశించారు. ప్రాథమిక పాటశాల గడిమునకంపల్లీ లో పనులపై ఏఈ పై ఆగ్రహం వ్యక్త పరిచారు. పనులను పది రోజులలో పూర్తి చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్య మైన బోధన అందేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తల్లి దండ్రుల తోడ్పాటుతో ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచలని, నాణ్యమైన బోధన అందించాలని, ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుని బోధించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపితేనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు టీచింగ్, లెర్నింగ్‌కు సంబంధించిన బోధనోపకరణలు, పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కే జీ బి వి ఎస్ ఓ ను కోరారు. ఈ సందర్భంగా… ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం, నైపుణ్యం ఉన్న ఉపా ధ్యాయులు ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసు కోవాలన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు మన ఊరు-మన బడి పనులు పక్షం లోగా త్వరగా పూర్తి చేయలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి, జీఈసిఓ పద్మ నళిని,ఎం ఈ ఓ వెంకటయ్య, ఎంపిపి నర్శప్ప,జడ్పిటీసి లావణ్య రాములు ఏఈ రఘునందన్,ఎంపిడిఓ విజయ లక్ష్మి, ఇంఛార్జి తహశీ్దార్ రవి కుమార్ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు ప్రధానోపాధ్యాయులు పాలుగొన్నరు.