విద్యార్థుల వసతి గృహాలలో వెంటనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డి హరిచందన .
కోవిడ్-19 తరువాత సెప్టెంబర్ 1 నుంచి రాష్టం లోని అన్ని విద్యాలయాలు పునర్ ప్రారంభం అయ్యాయని, పాఠశాలలకు విద్యార్థులు సైతం చేరుకుంటున్ననందున అన్ని వసతి గృహాలను ప్రారంభించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం నారాయణపేట జిల్లా మరికల్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలను, ధన్వాడ కస్తుర్బా పాఠశాల మరియు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. వసతి గృహాలలో ఉన్న సమస్యలను ఉపాద్యాయుల ద్వార అడిగి తెలుసుకున్నారు. మరికల్ మండల కేంద్రం లోని సాంఘిక గురుకుల పఠశాలను సందర్శించి పాఠశాల ను పరిశుబ్రపరుచుకోవాలని సూచించారు. వంటశాలను సందర్శించి వంట పాత్రలను పరిశుబ్ర పరుచుకోవాలని, నిత్యావసర సరుకులు ఏవైనా ఉంటె వాటిని మార్చు కోవాలన్నారు. వసతి గృహం లోని గదులను పరిశీలించి నిర్వాహకుల పై ఆగ్రహం వ్యక్తపరిచారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ద్వార పరిశుబ్రపరుచుకోవాలని, వసతి గృహాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వసతి గృహాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామా పంచాయతి పారిశుధ్య కార్మికుల ద్వార పాఠశాల ప్రాంగణం లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే టట్లు చర్యలు చేపట్టాలని గ్రామా సర్పంచ్ కు తెలిపారు. మరికల్ పాఠశాల తనిఖి కంటే ముందు ధన్వాడ మండల కేంద్రం లోని కస్తుర్బా పఠశాలను తనిఖి చేశారు. గ్రామా పంచాయతి ద్వార పాఠశాలకు ప్రహరి గోడను నిర్మించుకోవాలని సూచించారు. వసతి గృహాలలో మర్గుదోడ్ల లో కుళ్లయిల ఏర్పాటు చేయాలనీ సూచించారు. అదనపు గదులు నిర్మిస్తున్న నూతన భవనాన్ని పుర్తిచేయాలని ఆదేశించారు. బాలుర పాఠశాల లోని 9వ తరగతి లో స్మార్ట్ టివి ద్వార వీక్షిస్తున్న విద్యార్థులు తో మాట్లాడి పాటశాల రావడం చాల ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ తరగతి గదులలో ఉండాలని, భోజన సమయం లో చేతులను పరిశుభ్ర పరుచుకోవాలి సూచించారు.గ్రామా పంచాయతి నిధుల ద్వార ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాటశాల ప్రాంగణం లో కిచన్ గార్డెన్ అభిరుద్ది చేయాలనీ ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో ఈఈ పిఆర్ నరేందర్, ప్రధానోపద్యయులు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇంచార్జ్ ఏడి కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.