విద్యార్థుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్…

విద్యార్థుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్…

ప్రచురణార్థం

విద్యార్థుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్…

మహబూబాబాద్ జనవరి 4.
జిల్లా కేంద్రంలోని హనుమంత రావు నగర్ అర్బన్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరముల లోపు విద్యార్థులకు చేపట్టిన వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా కంకర బోర్డు విద్యార్థిని విద్యార్థులకు వేసిన కో వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా సురక్షిత మైనదని, వ్యాధులపట్ల తట్టుకునే శక్తిని ఇస్తూ కోవిడ్ నుండి రక్షింప జేస్తుందన్నారు. కుటుంబ సభ్యులందరు తీసుకునే విధంగా ప్రోత్సహించే బాధ్యత విద్యార్థులే తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ వెంట జిల్లా ఉప వైద్యాధికారి అంబరీష, జిల్లా కోవిద్ నోడల్ అధికారి విక్రమ్, పి.హెచ్.సి. డాక్టర్ స్రవంతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post