విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 27: విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అజాది కా అమృత్ మహోత్సవము, ఆగస్ట్, 12 న రిమోట్ సెన్సింగ్ డేలను పురస్కరించుకుని రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ పోటీలో రాష్ట్రం లోనే మొదటి స్థానం సాధించిన స్థానిక శ్రీ అరబిందో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గుఫ్రాన్ అనస్ కు NRSC & ISRO లు బహుకరించిన మెడల్, సర్టిఫికెట్లను కలెక్టరేట్ లో కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా గుఫ్రాన్ అనస్ మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, జిల్లా సైన్స్ అధికారిణి గౌసియా బేగం, శ్రీ అరబిందో పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post