విద్యార్ధినుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి……జిల్లా కలెక్టర్ కె. శశాంక.

విద్యార్ధినుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి……జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ముత్యాలమ్మ గూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూలై -31:

విద్యార్థినుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

ఆదివారం మధ్యాహ్నం మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మ గూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహం ఆవరణను, ప్లే గ్రౌండ్, వంట గదిని, డ్రైనేజ్ కాల్వను, కిచెన్ షెడ్, స్టోర్ రూం, ఆర్. ఓ.ప్లాంట్ ను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ నీరు వంట గది వరకు, పిల్లలు వాడే విధంగా ఏర్పాట్లు చేయాలని, డ్రైనేజ్ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, స్టోర్ రూం లో బియ్యం నిల్వలను పరిశీలిస్తూ తక్షణమే బస్తాల క్రింద బల్లాలు ఏర్పాటు చేయాలని, బియ్యం పదునెక్కకుండ చూడాలని, కూరగాయలు, కోడిగుడ్లు, వంట సరుకులు నిల్వ ఉన్న గదిని పరిశీలించి స్టోర్ రిజిస్టర్ ను తెప్పించి నిల్వ ఉన్న స్టాక్ ను అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్ లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని, చెత్తను ప్లే గ్రౌండ్ లో అస్తవ్యస్తంగా పడి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిమెంట్ కుండీలు, చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి వాటిలో వేయాలని తెలిపారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లను రెండు చోట్ల ఏర్పాటు చేయాలని, టాయ్లెట్ లలో ట్యాప్ లు సరిగా ఏర్పాటు చేసి నిరంతరం రన్నింగ్ వాటర్ ఉండే విధంగా చూడాలని, భోజనమును కిచెన్ షెడ్ వద్ద ఆరు బయట వడ్డించకుండా, డైనింగ్ హాల్, ఇతర గదులను వాడుకొని రెండు, మూడు చోట్ల కౌంటర్ లు ఏర్పాటు చేసి క్యూ పద్ధతిలో భోజనాన్ని వడ్డించాలని సూచించారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ కు ట్యాప్ ఏర్పాటు చేయకుండా వృధాగా నీరు పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ట్యాప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం పదవ తరగతి విద్యార్థినులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ, ప్రతిరోజు భోజనం రుచికరంగా ఉంటుందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, మెను ప్రకారం వడ్డిస్తున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వార్డెన్ కు తెలపాలని, మెరుగైన వసతులు కల్పించేలా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థానం లో ఉండాలని, ప్రాథమిక విద్య ప్రధానమని, విద్య పైనే భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని పదవ తరగతి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఏర్పాటు చేసిన వనరులను జాగ్రత్తగా వాడుకొని కాపాడుకోవాలని, మెష్ జాళిలు, ట్యాప్ లు, అవసరం అగు వసతులను కల్పిస్తామని తెలిపారు. ఇంకను కావలసిన సౌకర్యాలు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయమై విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసు కోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.

ఈ తనిఖీలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య, ప్రత్యేక అధికారిని ఆడిట్ అధికారిని డి.ప్రతిభ, తహశీల్డార్ నాగభవాని, హాస్టల్ వార్డెన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post