విద్యార్ధులందరు పాఠశాలకు రావాలి ::కలెక్టర్ B. గోపి

వంద శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వాలని కలెక్టర్ గోపి అన్నారు.

సోమవారం సెక్టోరల్, మండల విద్య శాఖ, నోడల్ అధికారులు, సివిల్ ఇంజనీర్ల తో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు .

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని కలెక్టర్ అన్నారు.

ఇప్పటికే కరోనా వైరస్ వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోయారని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ తమ పిల్లలకు జాగ్రత్త లను చెప్పి పాఠశాలలకు పంపించాలన్నారు.

ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ప్రతీ పాఠశాల లో శానిటేషన్ ను ప్రతీ రోజూ పక్కాగా నిర్వహించాలని విద్యా శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తోందన్నారు.

ఎలాంటి అనుమానాలకు పోకుండా విద్యార్థులు అందరూ పాఠశాలలకు రావాలన్నారు.

ఎక్కడైతే హాజరు శాతం తక్కువ ఉందో … అక్కడి MEO వెంటనే తగు చర్యలు తీసుకోని ప్రతీ విద్యార్థి ఇంటికి టీచర్లు వెళ్లి వారి పేరెంట్స్ కు అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం ప్రభుత్వ పాఠశాలలలో గల మౌలిక వసతుల పైన కలెక్టర్ రివ్యూ చేశారు.

ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఏ ఏ పాఠశాల లలో ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టారు, అట్టి పనులు ఏ ఏ దశలో ఉన్నాయి .అనే అంశాల పైన పూర్తి వివరాలను ఇవ్వలిసిందిగా DEO ను ఆదేశించారు.

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.

భోజనం చేసే ముందు విద్యార్థులు చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలలో ఫ్రూట్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేయండన్నారు .

విద్యార్థులకు కంప్యూటర్ లపైన బేసిక్ పరిజ్ఞానంను అందించాలన్నారు .

NGO, స్థానిక ప్రజప్రతినిధుల ధాతల సహాయంతో విద్యార్థుల కోసం పాఠశాలలలో కంప్యూటర్ లను కొనుగోలు చెయండన్నారు .

పాఠశాలలలో ఉన్న కిచెన్ షెడ్, టాయిలెట్ల కి సంబందించిన పూర్తి సమాచారాన్ని MEO లు వీలు అయినంత త్వరగా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశం లో DEO వాసంతి, TSEWIDC EE, MEO , తదితరులు పాల్గొన్నారు.

Share This Post