విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు నియోజక వర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేయండి- రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి

సెప్టెంబర్ 23, 2021ఆదిలాబాదు:-

విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు నియోజక వర్గ అభివృద్ధి పనుల నుండి నిధుల ఖర్చు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం లో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ, ఈ సంవత్సరం శాసన సభ్యులకు  నియోజక వర్గ అభివృద్ధి పనులకు కేటాయించిన ఐదు కోట్ల రూపాయల నుండి రెండు కోట్ల రూపాయలు పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు, నిర్మాణాలు, తదితర పనులకు ఖర్చు చేయాలనీ, మిగితా మూడు కోట్ల రూపాయలు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారని అన్నారు. అట్టి నిధులతో పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, తదితర పనులు చేపట్టవచ్చునని తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి 40 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందని, ఈ సంవత్సరం నియోజక వర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతి శాసన సభ్యునికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రము లోని మారుమూల గ్రామాల ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా 40 వేల కోట్లతో పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల, గుట్టలపై ఉన్నటువంటి గ్రామాలకు కూడా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమం కింద 97 శాతం మందికి టీకా ముందుకు పంపిణి చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అబినందించాలని అన్నారు. 2005 సంవత్సరానికి ముందు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న వారికీ భూ యజమాన్యహక్కు పత్రాలను అందించడం జరిగిందని, హక్కు పత్రాలు కలిగిన యజమాని చనిపోయిన వారసులకు హక్కు పత్రాలను జారీ చేయాలనీ, ఇప్పటి వరకు యాజమాన్య హక్కు పొందని వారికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కు పత్రాలను జారీ చేయాలనీ సూచించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న వారికీ యాజమాన్య హక్కు కల్పించేందుకు మంత్రులతో సబ్ కమిటీ వేయడం జరిగిందని వాటిపై కూలంకుషంగా చర్చించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు. ధరణి ద్వారా రైతుల భూములకు సంబందించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ధరణిలో కొన్ని భూ సమస్యలకు సంబంధించిన అంశాలను జోడించవలసి ఉందని, రైతుల భూములకు సంబంధించిన సమస్యలను తీర్చడం కోసం మంత్రుల సబ్ కమిటీ వేయడం జరిగిందని అట్టి కమిటీ చర్చించి నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలిపారు. అటవీ ఆధీనంలోని భూములను స్ట్రెంచ్ లు తవ్వడం జరిగిందని, వివాదం లో ఉన్న భూముల ప్రాంతంలో స్ట్రెంచ్ లు కొట్టడం జరగలేదని తెలిపారు. అంతకు ముందు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకమాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాచారం అందించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వ సభ్య సమావేశం నిర్వహించి గ్రామాలలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు సూచనలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. 15 వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మాసాంతం వరకు 87.17 లక్షల రూపాయలు జమ అయ్యాయని అట్టి నిధులను పనుల నిమిత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండలాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో అనారోగ్యంతో బాధ పడుతున్న వారికీ వివిధ పరీక్షల నిమిత్తం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రక్త నమూనాలు సేకరించి రిమ్స్ లోని టి-హబ్ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించి పరీక్షలను నిర్వహించి రిపోర్ట్ లను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు మిషన్ భగీరథ శుద్ధ మైన త్రాగునీరు ను సరఫరా చేసేందుకు సాంకేతిక పరమైన క్లోరినేషన్ చేయడం పై సమీక్షిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ నియోజక వర్గ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం కింద రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం పై వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏమన్నా సమస్యలు ఉత్పన్నమైతే ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అన్నారు. శాసన మండలి సభ్యులు టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, శుద్ధమైన త్రాగునీరు చివరి గ్రామాల ప్రజలకు అందించే విధంగా మిషన్ భగీరథ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. కలుషిత నీరు వలన మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. 2005 కు ముందు నుండి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు ROFR పట్టాలు అందని వారు ఉన్నారని వారందరికీ పట్టాలు అందించాలని అన్నారు. ప్రస్తుతం సాగులో ఉండి పట్టాలు లేని వారికీ యాజమాన్య హక్కు కల్పించాలని సూచించారు. అటవీ శాఖ గిరిజనుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ITDA ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 35 వేల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 4.90 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారని, 90 వేల మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, అందులో 45 వేల మంది కుటుంబాలు అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 13,డిసెంబర్ 2005 కు ముందు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ROFR పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల ఆరోగ్య విషయంలో భాగంగా గోండి, కోలం బాషలలో గిరిజన కళాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతిపాదించామని, గిరిజన ప్రాంతాలలో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం గిరిజనులకు జీవనోపాధి రుణాలు అందించడానికి 16 వేల దరఖాస్తులు రావడం జరిగిందని, ఈ సంవత్సరం సుమారు 5600 మందికి రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ సర్వ సభ్య సమావేశంలో విద్య, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెట్ కమిటీ, గృహ నిర్మాణం, సంక్షేమ శాఖల కార్యక్రమాలు, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, తదితర శాఖలపై సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆయా శాఖల అధికారులు వివరంగా సమాచారం అందించారు. గ్రామాలలో రోడ్లు మరమ్మత్తు, కల్వర్టుల నిర్మాణం, పాఠశాల అదనపు గదుల నిర్మాణం, ఆరోగ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు, ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం, తదితర అంశాలపై సభ్యులు అడిగిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సర్వ సభ్య సమావేశంలో జెడ్పి సీఈఓ గణపతి, బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, డీసీసీబీ ఇంచార్జి అధ్యక్షులు రఘునందన్, డీసీఎంఏస్ చైర్మన్ లింగయ్య, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post