విద్యాశాఖలో జరుగు బదిలీలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు :జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ
ములుగు జిల్లా(సోమవారం)
తేదీ 27.12.2021.

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖలో జరుగు బదిలీలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ మరియు స్పౌజ్ కి సంబందించిన వివరాలు త్వరగా సమర్పించాలి అని అన్నారు. ఐ ఎఫ్ యం యస్ ఆధారంగా సీనియారిటీ పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందని, ఖమ్మం జిల్లా వరంగల్లు జిల్లా ప్రాతిపాదికన ఈ బదిలీలు annexure 1,2 ల ఆధారంగా జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం జరుగుతుందని, ఉపాధ్యాయుల ఆప్షన్ ఆధారంగా రూల్స్ ప్రకారం బదిలీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు.
భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే వారికి స్పౌస్ తప్పని సరి అన్నారు. ఉపాధ్యాయుల ఖాళీ లను బట్టి బదిలీలు చేపట్టడం జరుగునని, స్కూల్స్ లో పిల్లల స్త్రెంత్ ను బట్టి టీచర్స్ బదిలీ కేటాయింపులు జరుగుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నోడల్ అధికారులను జాబితాను సబ్జెక్టు వారీగా తయారు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్జెడి రాజీవ్, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చాప బాబు దొర డి టి ఎఫ్, కిరణ్ యుటిఎఫ్ మధుసూదన్ ఎస్టియు దేవులపల్లి సత్యనారాయణ పి ఆర్ టి యు ఎండి అమీద్ యు టి ఎఫ్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post