విద్యాసంస్థలలో నిత్యం సానిటైజేషన్ జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
పత్రికాప్రకటన…2 తేదిః 03-09-2021
విద్యాసంస్థలలో నిత్యం సానిటైజేషన్ జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 03: పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అయిన తరుణంలో ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడడంతో సానిటైజేషన్, మంచినీరు ఉండెలా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాసంస్థల ప్రారంభం, వ్యాక్సినేషన్ మరియు విద్యాసంస్థలలో సానిటేషన్ కార్యక్రమాలపై జూమ్ వీడియో కాన్పరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాసంస్థలు ప్రారంభై మూడు రోజులు గడిచిపోయాయని, విద్యాసంస్థలు అన్ని విధాల పరిశుభ్రం, సానిటేషన్ పనులు చేయబడి పూర్తిస్థాయిలో తరగతులు నడవడానికి సిద్దంగా ఉండాలని అన్నారు. పాజిటివ్ కేసులు సంక్రమించ కుండా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలనని అన్నారు. ఎఎన్ఎమ్, ఆశా వర్కర్ల ద్వారా ఫీవర్ సర్వే నిర్వహించి పరీక్షలు నిర్వహించి, కేసుల వివరాలను స్థానిక మెడికల్ ఆఫీసర్ కు అందించాలని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండేలా చూడడంతో పాటు, ప్రైమరి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారికి కూడా టెస్టులు నిర్వహించాలని అన్నారు. విద్యాసంస్థులలో పనిచేసే టీచర్లు, వంటమనుషులు ఇతర సిబ్బంది అందరికి పరీక్షలు నిర్వహించాలని, 18 సంవత్సరాలు పైబడిని విద్యార్థులకు, టీచర్లు, మొదలగు ఫ్రంట్ లైన్ వర్కర్ లందరికి వ్యాక్సిన్ అందించాలని, మండలం వారిగా 18 పైబడిన పిల్లలు, టీచర్లు, మద్యాహ్నా భోజనం చేసే వారిలో మొదటి మరియు రెండవ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలున సేకరించాలని, ఇంకా వ్యాక్సిన్ చేయించుకోవలసిన వారి వివరాలను సేకరించాల్సిన బాద్యత MEO, మెడికల్ అధికారులు తీసుకొవాలని, రేపటి లోగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలలో వ్యాక్సిన్ తీసుకున్న వారి పూర్తివివరాలను సేకరించి నివేధికను అందించాలని సూచించారు. మెడికల్ అధికారులు మిషన్ మోడ్ లో వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి చెందిన వారైతే సిబ్బందిని డిప్యూట్ చేసి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో వ్యాక్సిన్ పూర్తిచేయాలని, ఎవరైన వ్యాక్సిన్ తిసుకోవడంలో విముఖత చూపినట్లయితె దానికి గల కారణాలను సెకరించాలని, ప్రతిరోజు RTPCR టేస్టులు 50 నుండి 60 పరీక్షలు నిర్వహించి, వైరాలజి ల్యాబ్ కు పంపించాలని, పిహెఛ్సిల నుండి రక్త, మూత్ర పరీక్షలను సేకరించి ల్యాబ్ కు పంపించి రిపోర్టులు పొందాలని అన్నారు. ప్రతిపాఠశాలలో తరగతులు నిర్వహించాలని, పాఠశాలలు తెరవక పోవడానికి గల కారణాలను మ్యానేజ్ మెంట్ లతో మాట్లాడి కారణాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలలో సిబ్బంది అందరికి వ్యాక్సిన్ చేయించుకోవాలని, విద్యాసంస్థల వద్ద 100% వ్యాక్సినేటెడ్ బోర్డులు పెట్టడం, దృవీకరణలను ఇవ్వడం చేయాలని అన్నారు. ప్రతిరోజు కళాశాల టిచర్, విద్యార్థుల అటెండెంన్స్ వివరాలు పంపించాలని, మున్సిపల్ కమీషనర్లు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ద చూపించాలని, ఫాగింగ్ మిషన్ లను వాడాలని, ఎక్కడ కూడా నీరు నిలువ కుండా చూడాలని, నీరునిలిచిన ప్రాంతాలలో గంబుషియా, ఆయిల్ బాల్ వదలాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, లక్ష్యాల మేరకు హైరిస్క్ ఎరియాలలో కనీస ఎర్పాట్లు చేయాలని, అవగాహన కొరకు ఆడియో క్లిప్ ల ద్వారా ప్రచారం చేయాలని, కోవిడ్ లేదా సాదారణ అనారోగ్యాలు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హైరిక్స్ ఎరియాలలో మెడికల్ క్యాంప్ లను ఎర్పాటు చేయాలని, పరిస్థితుల ప్రభావం దృష్యా సిబ్బంది అందుబాటులో ఉండాలని, గ్రామ సానిటైజేషన్ కొరకు ఎక్కవ సానిటేషన్ సిబ్బందిని ఎర్పాటు చేయాలని, అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని, 18 మండలాలో మోగా పల్లెప్రకృతి వనాలలో పిటింగ్ పనులు పూర్తి చేయాలని, అవసరం మేర కూలీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణాకు హరితహారం లక్ష్యసాధనలో అధికారులు కొంత వెనకబడిఉన్నారని, ఎక్కవ శ్రద్ద వహించాలని పేర్కోన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించాలని, ప్రతిరోజు అవగాహ మరియు సానిటెషన్ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలలో టాయిలెట్లు నిర్వహణ సక్రమంగా జరిగేలా మున్సిపల్ కమీషనర్లు తనిఖీలు చేయాలని, జనాలు ఎక్కువ ఉండే ప్రదేశాలలో సానిటేషన్ కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టాలని, గోదావరి ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ మరియ దేవాలయాలు, గోదావరి నది పరిసరాలలో సానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని, పాజిటివ్ కేసులు వచ్చాయన్న కారణంగా విద్యాసంస్థలను మూసివేయరాదని, కలెక్టర్ మరియు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. బ్లిచింగ్ పౌండర్ ను అందుబాటులో ఉంచుకొవాలని, వర్షాల వలన డెంగ్యూ, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నందున క్లోరినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, ఇతర అధికారులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
విద్యాసంస్థలలో నిత్యం సానిటైజేషన్ జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
