విద్యాసంస్థల పనితీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెలికాన్ఫరెన్స్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:3.9.2021
వనపర్తి.

అన్ని విద్యాసంస్థలు సెప్టెంబర్ 1 నుండి పునః ప్రారంభించిన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్యాసంస్థల పనితీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విధంగా, విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
18 సం.లు పైబడిన విద్యార్థులు అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ప్రతి విద్యా సంస్థల అధికారులతో చర్చించి, చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచించారు.
కోవిడ్ దృష్ట్యా గత 16 నెలలుగా విద్యాసంస్థలు మూసి ఉండడంతో పారిశుద్ధ్య లోపం ఉంటుందని, పారిశుధ్యంపై శ్రద్ధ వహించి వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన తెలిపారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ అంకిత్, డి.పి.వో. సురేష్, డిప్యూటీ డి.ఎం & హెచ్.ఓ. శ్రీనివాసులు, డాక్టర్ రవిశంకర్
తదితరులు పాల్గొన్నారు.
………………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post