విద్యాసంస్థల పున: ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి ప్రభుత్వ, (పైవేట్‌ విద్యా సంస్థలు పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శానిటైజేషన్‌ కార్యక్రమాలు ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేసి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా పరషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా గత 16 నెలలుగా విద్యా నంస్థలు మూసి ఉన్నాయని, తరగతులు పున: ప్రారంభించనున్న నేపథ్యంలో తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదులతో పాటు పాఠశాలల, కళాశాలల ఆవరణ, పరిసరాలలో పిచ్చిమొక్కలు తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని, నల్లా కనెక్షన్లు లేని పాఠశాలలకు త్వరితగతిన కనెక్షన్లు
ఇచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, చిన్న మరమ్మత్తులు ఉన్నట్లయితే వెంటనే చేయించాలని తెలిపారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, పైవేట్‌పాఠశాలలో పారిశుద్ద్య చర్యలపై జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పారిశుద్ద్య చర్యలు నిర్వవాంచి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రైవేట్‌ విద్యా
సంస్థలు వినియోగించే బస్సులలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని, పాఠశాలలో ఏదేనీ ఒక విద్యార్థి దగ్గు, జలుబు, జ్వరము వంటి కొవిడ్‌ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత [ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ నిర్ధారణ పర్‌క్షలు చేయించాలని, విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి ఆ తరగతి గదిలో ఉన్న (పైమరీ కాంటాక్ట్‌ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల భవనాలలో అవసరమైన చోట వైట్‌ వాష్‌ చేసేందుకు సంబంధిత అనుమతులతో [గ్రామపంచాయతీ నిధులు వినియోగించాలని, తరగతి గదులలో ఫ్యాన్సు, విద్యుత్‌ పనులను పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, (గ్రామీణ నీటిపారుదల శాఖ ఈ.ఈ. అంజన్‌రావు, జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వవణ అధికారి నరేందర్‌, మండల పరివత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post