*విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం :: రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాత్ రెడ్డి*

ప్రచురణార్థం……2

తేదీ.25.1.2022

*విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం :: రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి  వేముల ప్రశాత్ రెడ్డి*
*విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం :: రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాత్ రెడ్డి*

జగిత్యాల, జనవరి 25: దేశంలో ఎక్కడా లేని విదంగా విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాత్ రెడ్డి తెలిపారు.గ్రామీణ ప్రాంత వైద్యం మెరుగు పడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వాప్తంగా ఒకేసారి 4వేల కోట్లతో 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు సంకల్పించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేక శ్రద్ద వహించి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని, మెరుగైన వైద్యం అందించడం తో పాటు రానున్న విద్య సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు మొదలు పెట్టనున్నట్లు పేర్కోన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలొని మెడికల్ కళాశాల, మాత శిశు ఆసుపత్రి నిర్మాణ పనులను జగిత్యాల శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో కలిసి మంగళవారం పరిశీలించారు. అంనంతరం జిల్లా కేంద్రంలోని ఐ.ఎం.ఏ. హలులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల, మంచిర్యాల, రామగుండం, భద్రాద్రి కోత్తగూడెం, మహబుబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి లలో 8 వైద్య కళాశాలల నిర్మాణాల బాద్యతలను ఆర్ ఆండ్ బి శాఖకు అప్పగించడం జరిగిందని తెలియచేసారు.

ఈ మెడికల్ కళాశాల ద్వారా ప్రతి సంవత్సరం పూర్తి ప్రభుత్వ ఖర్చులతో దాదాపు 12వందల మంది వైద్యులు తెలంగాణ ప్రభుత్వంలో సిద్దం అవుతారని, ఈ వైద్యులందరు గ్రామీణ ప్రాంతాలలోనే వైద్య సేవలను అందించేలా చూడడం జరుగుతుందని అన్నారు. ప్రతి మెడికల్ కళాశాల నిర్మాణానికి 200కోట్లు, ఆసుపత్రి నిర్మాణానికి 300 కోట్ల మొత్తం 5వందల కోట్లు నిధులను సమకూర్చడం జరుగుతుందని అన్నారు. త్వరలో మెడికల్ కళాశాల నిర్మాణాలను పూర్తిచేసుకోని ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, కళాశాల నిర్మాణాపనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూసి మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడానికి జగిత్యాల శాసన సభ్యులు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, లైబ్రరీ చైర్మెన్ డా.చంద్ర శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి , అడిషనల్ కలెక్టర్బి.ఎస్. లత , అర్ అండ్ బి ENC గణపతి , ఈఈ శ్రీనివాస్, వైద్యఅధికారులు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జగిత్యాల ఆర్డీవో మాధురి, స్థానిక కౌన్సిలర్ రాజ్ కుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు, పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post