విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుంది : రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి

విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి మనబడి మన బస్తి కార్యక్రమం కింద రెండు కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించి నట్లయితే పాఠశాలలు గొప్పగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని నిధులు వెచ్చించడం జరుగుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాల ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యను అందించడం వల్ల గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగిందని మంత్రి అన్నారు. ఈ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, మౌలిక సదుపాయాలను కల్పించి నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయని మంత్రి అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధనను బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన ఆంగ్ల బోధన అందించేందుకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో పోటీపడి చదవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు వచ్చేవరకూ ఎప్పుడు రివిజన్ చేస్తూనే ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు,  జిల్లా కలెక్టర్,  అధికారులు,  ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులు,  విద్యా కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నందున పాఠశాలలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న మన ఊరు మన బడి కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. జిల్లా పరిషత్ నిధుల నుండి పాఠశాలకు అదనంగా తరగతులను నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను  దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవడంతో పాటు క్రీడలకు కూడా  ప్రాధాన్యత ఇవ్వాలని చైర్ పర్సన్ సూచించారు. ఆడపిల్లలు తమ లక్ష్యాన్ని ఎంచుకొని ని ఉన్నత చదువులు చదివి మంచి స్థానం లోకి వెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్,   గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్,  జడ్పీటీసీ ప్రమోదిని,  ఎంపీపీ చంద్రకళ,  మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవళిక, నజరానా బేగం, అదనపు కలెక్టర్ మోతిలాల్,  విద్యాశాఖాధికారి రేణుకాదేవి,  ఆర్ అండ్ బి  ఇఇ లాల్ సింగ్, ప్రధానోపాధ్యాయులు అనంత్ రెడ్డి,  విద్య కమిటీ చైర్మన్  శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Share This Post