విద్యా శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ,పారదర్శకంగా ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోరారు.*

*విద్యా శాఖ లో ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై గురువారం జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డి.ఈ. ఓ.లు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి స్ధానిక ఉపాధ్యాయులు, ఉద్యోగులు  కేటాయింపు ప్రక్రియ,సీనియారిటీ జాబితా ల పై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిద్యా శాఖ లో ఉపాధ్యాయుల,ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ సాఫీ గా నిర్వహించుటకు ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని ఆయన కోరారు.ఇప్పటి వరకు రంగా రెడ్డి, నిజామాబాద్,వరంగల్,మహబూబ్ నగర్ జిల్లాలో ప్రక్రియ పూర్తి అయినట్లు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సలహాలు,సూచనలు స్వీకరించి కేటాయింపు ప్రభుత్వ నిబంధనలు ననుసరించి   పారదర్శకంగా,తప్పులు లేకుండా సీనియారిటీ,ఆప్షన్ ల ప్రకారం కేటాయింపు ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను కోరారు.జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు, సీనియారిటీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించి పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు వివరించారు.ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.*
*జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నిబంధనలు అనుసరించి సీనియారిటీ,ఆప్షన్ లు,స్పెషల్ కేటగిరీ ప్రాధాన్యత ప్రకారం పారదర్శకంగా నిర్బహిస్తామని అన్నారు.*
*ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మూడు జిల్లా ల విద్యా శాఖ అధికారులు భిక్ష పతి,(నల్గొండ),నర్సింహ (యాదాద్రి భువన గిరి),అశోక్(సూర్యా పేట),విద్యా శాఖ అదనపు డైరెక్టర్,పరిశీలకులు ఏ.సత్య నారాయణ రెడ్డి, పి.ఆర్.టి.యు. టి.ఎస్.అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుంకరి భిక్షం గౌడ్,కాలం నారాయణ రెడ్డి, టి.ఎస్.యు. టి.యఫ్. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు,పెరుమాండ్ల వెంకటేశ్వర్లు,ఎస్.టి.యు. అధ్యక్షుడు జి.భూమయ్య,TPUS ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీ రాం, టి.ఆర్.టి.ఎఫ్. అధ్యక్షుడు ఎల్.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.*

విద్యా శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ,పారదర్శకంగా ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోరారు.*

Share This Post