విద్యుత్, సాగు నీటి సరఫరా లేని వైకుంఠదామాలలో సాధ్యమైనంత త్వరగా ఆ సౌకర్యాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

విద్యుత్, త్రాగునీటి సరఫరా లేని వైకుంఠధామాలలో సాధ్యమైనంత త్వరగా ఆ
సౌకర్యాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
—————————-
జిల్లాలో అన్ని వైకుంఠధామాలలో సాధ్యమైనంత త్వరగా విద్యుత్, త్రాగు నీటి సరఫరా సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సెస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం ఐ డి ఓ సి లోని మినీ మీటింగ్ హాల్ లో వైకుంఠ ధామాలలో మౌలిక వసతుల కల్పనపై సెస్ ఎండీ రామకృష్ణ, మిషన్ భగీరథ ఈఈ జానకి, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డిఆర్డిఓ మదన్ మోహన్, dpo రవీందర్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయితీ లలో వైకుంఠ గ్రామాలు ఉండగా…
వీటిలో 59 గ్రామపంచాయతీ లోని వైకుంఠ ధామాల కు త్రాగునీటి సౌకర్యం లేదని, అలాగే 63 గ్రామపంచాయతీ లోని వైకుంఠ ధామా లకు విద్యుత్ సౌకర్యం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని వైకుంఠ ధామాలకు సాధ్యమైనంత త్వరగా ఆ సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు
——————————

Share This Post