విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి,అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి – జడ్పీ చైర్పర్సన్ శాంత కుమారి

పత్రిక ప్రకటన
తేది: 23-01-2023

విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి,అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి – జడ్పీ చైర్పర్సన్ శాంత కుమారి

నాగర్ కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్ పి చైర్ పర్సన్ శాంత కుమారి అధ్యక్షతన గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ అధ్యక్షతన విద్యా, వైద్యం పై జడ్పీ స్థాయి సంఘం సమావేశం సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ శాంత కుమారి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పులను చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవాలకు వచ్చే మహిళలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్యులు అత్యంత అప్రమత్తతో ఉంటూ ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉందన్నారు.
విధుల నిర్వహణలో డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్నారు.
జిల్లా ఆసుపత్రిలో వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, వైద్యులు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలన్నారు.
జిల్లాలో 100% అందత్వ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి విద్యార్థి సామర్ధ్యాలు మెరుగుపడేలా తొలిమెట్టు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన 290 పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికోసం ప్రతీ అధికారి, ప్రజాప్రతినిధి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్య, వైద్యం స్థాయి సంఘాలకు చైర్మన్గా వివరించిన వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పిటిసిలు హరిచరణ్ రెడ్డి గౌరమ్మ, లక్ష్మమ్మ, రాంబాబు, నేజమ్మ ఆయా శాఖల జిల్లా అధికారులు వైద్యులు తదితరులు హాజరయ్యారు.

———————–
జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి, నాగర్ కర్నూలు ద్వారా జారీ.

Share This Post