మాటేడు
తోరూర్ / మహబూబాబాద్ 01 ఫిబ్రవరి:
తొర్రూరు మండలం మాటేడు జిల్లా పరిషత్ పాఠశాలలో మొదటి విడతలో జిల్లాలో మన ఊరు మనబడి నిర్మాణాలు పూర్తి అయిన తరగతి గదులను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
మాటేడు గ్రామం గొప్ప చరిత్ర కలదని, కాకతీయుల కాలం నుండి పరిపాలన కొనసాగించబడ్డదని, దేవాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. 50 ఇండ్లను నిర్మించడం జరిగిందని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేయడమైనదని, మన ఊరు మన బడిలో ఇప్పటికీ 21 లక్షలు ఖర్చు చేయడమైనదని,30 లక్షలతో మిగిలిన పనులు పూర్తి దశలో చేయనున్నట్లు తెలియజేసారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలొనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కార్పోరేట్ స్థాయికి మించి మెరుగైన వసతులను కల్పిస్తూ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
పాఠశాల భవనాలకు మరమ్మతులు, పచ్చని పరిసరాలు అహల్లాదకరమైన వాతావరణం లో తరగతుల నిర్వహణ, జ్ఞానాన్ని పెంపొందించే విధంగా డిజిటల్ తరగతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్ల నిర్మాణం, కాంతివంతమైన లైటింగ్ ఏర్పాటు చేయడం, అవసరం మేరకు ఫర్నిచర్ డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ బోర్డులు, స్వచ్ఛమైన తాగునీరు లాంటి మెరుగైన వసతులు కల్పిస్తూ ప్రవేట్ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు మనబడి కార్యక్రమంలో బడులను అభివృద్ధి పరచుకొని విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే మార్గదర్శకాలు కావాలన్నారు.
12 రకాల మెరుగైన అధునాతన వసతులు కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
సర్కారు బడులకు సకల వసతులు
కార్పొరేట్ పాఠశాలలను మించి ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
విద్యార్థుల బంగారు భవితవ్యానికి ప్రభుత్వ బడుల ధీమా
నీళ్లు వచ్చి వ్యవసాయం పెరిగి భూముల ధరలు పెరగడంతో రైతుల గౌరవం పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతున్నాయని, సర్కారు బడులలో సకల వసతులు ఏర్పాటు అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
ఎంత డబ్బులు ఖర్చు అయినా… స్కూల్ బాగా చేస్తాం. అయితే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలి. మంచి విద్య అందించాలి.
సాయంత్రం ప్రైవేట్ టీచర్లు పెట్టీ ట్యూషన్ చెప్పించాలి.
మహబూబాబాద్ లో 500 కోట్లతో పెద్ద హాస్పిటల్ నిర్మించుకోబోతున్నామని, మెడికల్ కాలేజీ నిర్మించి తరగతులు కూడా ప్రారంభించామని అన్నారు
ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యతోపాటు, ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులు, పౌష్టికాహారమైన మధ్యాహ్న భోజనం, ఆటలు సాంస్కృతిక వైజ్ఞానిక వివిధ రంగాల్లో మెలకువలు నేర్పుతూ సకల సౌకర్యాలతో విద్యార్థుల భరోసా మన ప్రభుత్వమే బాధ్యతగా భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. అనంతరం పిల్లలతో మమేకమై వారికి అల్పాహారం తినబెట్టారు, చాక్లెట్లు పంచి క్రమంగా పాఠశాలకు వచ్చి ఉన్నతమైన ఆలోచనలతో గురువులు చెప్పే బోధనను ఆచరణలో పెట్టాలన్నారు
జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలు 12 వసతులతో సకల సౌకర్యాలతో కార్పొరేట్ విద్యను అందించే దిశగా ప్రభుత్వo ఎక్కడలేని విద్యారంగాన్ని ప్రోత్సహిస్తుందని 21 లక్షలు ఇప్పటివరకు పాఠశాలకు పనులకు ఖర్చు చేయడం జరిగిందని, ప్రత్యేక తరగతులు ఈ నెల నుండి ప్రారంభం కానున్నాయని విద్యార్థులపై బాధ్యత ఉందని గొప్ప వరంగా భావించాలని మనబడి ని మనం కాపాడుకొని పేరు ప్రఖ్యాతలు పాఠశాలకు తేవాలని అదనపు కలెక్టర్ అన్నారు.
డిపిఆర్ఓ సారథ్యంలో సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఆలపించిన గీతాలు ఆకర్షణీయoగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, ఆర్డిఓ ఎల్ రమేష్, ఏఎంసీ చైర్మన్ శాంత, ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ నారాయణ, ఎంపీడీవో కుమార్, తహసిల్దార్ ప్రసాద్, సర్పంచ్ శోభ, పినాకపాణి, ఎస్ఎంసి చైర్మన్ వల్లపు సాయిలు, హెచ్ఎం వేణు మాధవరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.