విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా చేపట్టాలి…జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన వెగవంతంగా చేపట్టాలి…

మహబూబాబాద్, ఆగస్ట్,27.

విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన
వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలల పునః ప్రారంభం పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలోని 1209 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్న 928 పాఠశాలలో గిరిజన సంక్షేమం పరిధిలోని 19 ఆశ్రమ పాఠశాలలు, మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 6 ప్రీమెట్రిక్ పిల్లల పాఠశాలలు, ఇంటర్ నుండి డిగ్రీ వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల 9 పోస్ట్ మెట్రిక్ వసతుల స్కూల్స్, ఒకటవ తరగతి నుండి మూడవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న పిల్లల 104 పాఠశాలలు తో పాటు బీసీ సంక్షేమం పాఠశాలలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్ర పరిచి మౌలిక వసతుల కల్పన సమకూర్చినట్లు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలన్నారు.

మిషన్ భగీరథ అధికారులు స్వయంగా పాఠశాలను సందర్శించాలని నీటి సరఫరాపై నివేదిక ఇవ్వాలన్నారు.

అదేవిధంగా విద్యుత్ సరఫరా ప్రతి పాఠశాలకు ఉండి తీరాలని పాఠశాలలను విద్య గ్రాంట్ నిధులతో వైట్వాష్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.

పాఠశాలల్లో ఆవరణ లున్న చోట 400 మొక్కలు నాటితే వాచర్ ను నియమించడం జరుగుతుందన్నారు. వాచర్ తో పార్కు నిర్వహణతో పాటు గా పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేయించ వచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య గిరిజన సంక్షేమం ఉపసంచాలకులు దిలీప్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ బీసీ సంక్షేమం అధికారిని అనిత, మిషన్ భగీరథ అధికారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post