విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

                                                       విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు ::  జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, అగస్టు 19: విధినిర్వహణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డిఓ, సర్వే, పౌరసరఫరాల అధికారులు మరియు తహసీల్దార్ లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ దరఖాస్తులలో శాసనసభ్యుల అనుమతులకు పంపిన ధరఖాస్తుల పరిష్కారంలో అలస్యం కాకుండా చూడాలని, లబ్దిదారులు సమర్పించిన దృవీకరణ పత్రాలలో ఏవైన సమస్యలు తలిత్తినట్లయితే వాటిని పై సకాలంలో చర్యలు తీసుకొని, బడ్జెట్ ప్రకారం ట్రెజరి, బ్యాంకు వద్ద త్వరగా పరిష్కరించేలా చూసి లబ్దిదారులకు చెక్కులను అందించాలని సూచించారు.  సర్టిఫికేట్, ధరణి స్లాట్ బుక్కింగ్ లో అలస్యంగా జరుగకుండా పనులు త్వరగా జరిగాయాని, భూసమస్యల ధరఖాస్తులను పరిష్కరించాలని, పిఓబి లో పెండింగ్ ఉండకూడదని,  TS b PASS నందు నూతన మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరుగుచున్నది, లేనిది క్షుణంగా తనిఖీలు నిర్వహించాలని, లేనివాటిపై నిబంధనల మేరకు చట్టరిత్య చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.  సర్వేచేసే క్రమంలో సర్వేయర్లు పొరపాట్లు చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని, డిప్యూటి ఇన్స్పెక్టర్ ల వద్ద పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఆర్డిఓలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   సర్వే చేయవలసినవి  పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని,  సర్వే క్రమంలో పొరపాట్లను తీవ్రంగా పరిగణించి వారిపై చట్టరిత్యా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి పనులపై సమీక్షించాలని ఆర్డిఓలు, సర్వేశాఖాధికారిని అదేశించారు. జిల్లాలో మంజూరైన 7621 FSC కార్డులు లబ్దిదారులకు అందజేయడం పూర్తియి, చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు అందించేలా చర్యలు జరగాలని, PDS బియ్యం అక్రమ రవాణ జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించి మండలం వారిగా 10 కేసులకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. రైస్ మిల్లులు, చౌకధరల దుకాణాలు, కిరాణ వివిధ ప్రదేశాలలో తహసీల్దార్లు వీలైనాని ఎక్కువ సార్లు తనిఖీలు నిర్వహించాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలొ స్థానికసంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్,  పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, సర్వే శాఖాధికారి, తహసీల్దార్లు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post