విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—3 తేదీ.21.9.2021

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల సెప్టెంబర్ 21 :- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి.రవి స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ధర్మపురి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసిన కాలంలో వివిధ ఫిర్యాదులు రాగా వాటిపై విచారణ అధికారి చేత విచారణ చేపట్టడం జరిగింది. ఎస్.ఆర్.ఎస్.పి. ప్రభుత్వ భూమిని ఇతరులకు ప్రభుత్వ భూమి కాదని ఇంటి నెంబర్ కేటాయించి రికార్డులు తప్పు గా చూపినారు మరియు గ్రామ పంచాయతీ జాబితా పూర్ యందు రూ.1,70000/- నిధులకు పంచాయతీ కార్యదర్శి సరైన రికార్డులు నిర్వహించన్నట్లుగా గమనించడం అయినదని, అట్టి చెల్లింపులకి సంబంధించిన రికార్డులు లేవు, రికార్డు నిర్వహణ లోపం, ఇట్టి విషయాలు పరిశీలించడం ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేకర్ తన విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తెలిసిందని, దరిమిలా ప్రభుత్వ నియమాలను అనుసరించి, సీసీఎ నియమ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న చంద్రశేకర్ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post