విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్ డి హరిచందన

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్ డి హరిచందన

 

సంక్షేమ  వసతి గృహాల పునఃప్రారంబానికి తగిన మరమ్మతులు పూర్తి చేయాలని   నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ హాస్టళ్ల పునఃప్రారంబానికి భవనాల మరమ్మతులు తదితర అంశాల పై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల పై పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  హాస్టళ్లకు మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, ఇతర మరమ్మతులు కొత్తగా చేపట్టవలసిన పనులపై నివేదిక  కోరగా అధికారులు సరైన సమాచారం ఇవ్వలేక పోయారు.  నివేదికలు తీసుకురాకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు చిత్తశుద్ధి తో పనిచేయాలని ఇప్పటికే గుర్తించిన పనులను మరమ్మతులు చేయవలసిందిగా ఆదేశించగా తీసుకున్న చర్యలపై నివేదికలు లేకుండా రావడం ఏమిటని ప్రశ్నించారు.  సమావేశానికి పూర్తి నివేదికతో రావడం అలవాటు చేసుకోవాలని ఆదేశించారు.  చాలా రోజుల తర్వాత హాస్టళ్లు పునః ప్రారంభమవుతున్నాయని వాటికి చేపట్టాల్సిన మరమ్మతులు పూర్తి చేయమని  ఇదివరకే ఆదేశించడం జరిగిందన్నారు.  పూర్తి నివేధికలతో రావాలని పంపించారు.

ఈ సమావేశం లో ఈ ఈ పీఆర్ నరేందర్, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post