విధుల పట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య* ఇద్దరు ఆదర్శ రైతుల ఒక్కొక్కరికి  10 వేల రూపాయల చెక్కులను  జిల్లా కలెక్టర్ చేతుల అందజేత*

వార్త ప్రచురణ

తేది: 23-09-2021

ములుగు జిల్లా (ఏటూరు నగరం)

 

 

వ్యవసాయ శాఖ అధ్వర్యంలో గురువారం రోజున  ఏటూరు నగరం ఐటి డిఎ కార్యాలయం  లో  ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్) కమిటీ తో సమావేశం  జరిగింది.

ఈ కార్యక్రమానికి   జిల్లా కలెక్టర్ ఎస్.  కృష్ణ ఆదిత్య రైతులనుద్దేశించి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యత తో అధిక దిగుబడి పంటలు పండించుటలో  వ్యవసాయ అధికారులు రైతులకు  అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ అనుబంధ  ఆధారిత పంటలు  వరి,మిరప,పల్లి,తదితర పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ ,ఉద్యానవన ,వెటర్నరీ, మత్స్యశాఖ ల ద్వారా రైతులకు ఉపయోగ పడే   ప్రభుత్వ పథకాల ను  అర్హత మేరకు రైతులకు  అందేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్   ఆదేశించారు.అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం ఆర్జించే విధం గా వ్యవసాయం చేయాలని కలెక్టర్  అన్నారు.

రైతులకు ఆదాయ మార్గాలు ఇచ్చే అనేక పథకాలు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని ,  తద్వారా  వాటి పైన  రైతులకు అవగాహనా  కల్పించే విధంగా ప్రణాళికలు  సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్  అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

ఆత్మలో ఉన్న నిధులను ఉపయోగించి మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా  మూడు  గిరిజన గ్రామాలను ఎంపిక చేసుకుని మేడారం, పంబాపుర్,నర్సాపూర్ లలో   ప్రతి ఇంటికి 45 కోడి పిల్లల  పెంపకం పథకాన్ని మంజూరు చేయాలని  సంబంధిత వెటర్నరీ అధికారని  ఆదేశించారు.

మత్స్యశాఖ అద్వర్యం లో   చేప పిల్లల పెంపకానికి ఫిష్ ఫాండ్ నిర్మాణానికి ఉత్సాహ వంతులైన ఆదర్శ రైతులను  ఎంపిక చేసి  తద్వారా   ఇద్దరి  ఆదర్శ రైతులను గుర్తించి ఫిష్ పాంట్స్ ఏర్పాటు చేయుటకు నారెగా ద్వారా పనులు చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  కలెక్టర్  అన్నారు.

వ్యవసాయ అధికారులు మండలాల వారిగా ముందస్తు టూర్ డైరీ రూపొందించి నివేదికల ఆధారంగా ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్ అన్నారు. సారవంతమైన భూమి కి నీటి సౌకర్యానికి అనుగుణంగా ఉన్న పంటలపై రైతులు మొగ్గు చూపే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

ఏ ఈ ఓ లు క్షేత్రస్థాయి పర్యటనలు అటెండెన్స్  యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని,   వారానికొకసారి గ్రామాలను పర్యటిస్తూ ప్రతి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా  సమాచారం తెలియజేయాలని కలెక్టర్ అన్నారు.

మండలాలలో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించిన ప్పుడు ఆత్మ సభ్యులను తప్పనిసరిగా పిలవాలని వారితో  సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత   అధికారులను ఆదేశించారు.

ఇద్దరు ఆదర్శ రైతులు రావుల సునీత, కుమ్మరి తిరుపతయ్య లకు ఒకొక్కరికి   10 వేల రూపాయల చెక్కుల ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, ఫిషరీస్ ఎడి వీరన్న, వెటర్నరీ అధికారి విజయ్ భాస్కర్, అత్మ  చైర్మన్ దుర్గం రమణ,  శ్రీనివాస్,  ఏ డి ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post