వినాయకుల నిమజ్జనం జరుగు మనకొండూర్ చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువును కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

నిమజ్జనం చేసే మానకొండూరు చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులను సందర్శించిన మంత్రి

0000000

ఈనెల 19న జరగనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ , నగర మేయర్ సునీల్ రావు, అదనపు కలెక్టర్- మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గరిమ అగర్వాల్, అధికారులతో కలిసి వినాయక నిమజ్జనం జరిపే మానకొండూర్ చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, పెద్ద క్రే న్లు, చిన్న క్రేన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పట్టణంలో సుమారు 500కు పైగా మండపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు, ఒక్కొక్క నిమజ్జనం కేంద్రానికి సుమారు రెండు వందల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీ గణపతి విగ్రహాలు మానకొండూర్ చెరువుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, భక్తులు సహకరించి విగ్రహాలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని కోరారు. రాంనగర్ పాయింట్ నుంచి చింతకుంట కెనాల్ కు, టవర్ నుంచి మానకొండూర్ చెరువుకు, కోర్ట్ చౌరస్తా నుంచి కొత్తపల్లి చెరువుకు వినాయక విగ్రహాలు తరలి వెళ్తాయని మంత్రి తెలిపారు. ఒకటో నెంబర్ విగ్రహం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుందని, తదుపరి విగ్రహాలు వరుసక్రమంలో నిమజ్జనం పాయింట్ల వద్ద కు తరలి వెళతాయని, అర్ధరాత్రి 12 గంటల వరకు నిమజ్జనం కార్యక్రమం దాదాపుగా పూర్తవుతుందని మంత్రి తెలిపారు.

ఈ సందర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్- మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ గరిమ అగర్వాల్, జడ్పిటిసిలు, డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ జువేరియా, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు,ఇర్రిగేషన్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post