వినాయక ఉత్సవాలను కొవిడ్ ఫ్రీ వాతావరణంలో నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 04, 2021ఆదిలాబాదు:-

ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించడానికి శాంతి కమిటీ సభ్యుల సూచనల మేరకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జిల్లా శాంతి కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు, అన్నీ గణేష్ మండల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్క కరోనా కేసు కూడా రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు, పట్టణంలోని రోడ్ల మరమ్మతు, విద్యుత్తు, లైటింగ్, వ్యవస్థను పూర్తి చేస్తామని తెలిపారు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా అందరూ పండుగ అనుభూతి పొందాలన్నారు, జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గణేష్ విగ్రహాల వద్ద, శోభాయాత్ర సమయంలో డిజె సౌండ్ సిస్టంకు అనుమతి లేదని స్పష్టం చేశారు, గణేష్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు, అన్ని గణేష్ మండళ్ళ వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు, ముందస్తుగా అందరూ ఆన్ లైన్ లో గణేష్ మండలి నిర్వాహకుల పూర్తి వివరాలు నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు, ( http://policeportal.tspolice.gov.in ) లింక్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలన్నారు, వర్షాలు కురుస్తుండడంతో మండళ్ళ వద్ద చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు, విద్యుత్తు అధికారులతో సమీక్షించి, పటిష్టంగా నాణ్యమైన వైర్ తో బిగించి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు, అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు, అన్ని గణేష్ మండళ్ళను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు, గణేష్ నిర్వాహకులు 24 గంటల పాటు గణేష్ మండలి వద్ద రక్షణగా వాలంటీర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు, కోవేట్ నిబంధనలు పాటిస్తూ ప్రసాదాలు, జాగ్రత్తగా స్వీకరించాలని కోరారు, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, గణేష్ మండలి వద్ద శానిటేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు, మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు, ఎలక్ట్రికల్ లైన్ మెన్ ద్వారా వేలాడే వైర్లను బిగించాలని సూచించారు, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని, మొబైల్ వాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతామని సూచించారు. ఈ సమావేశంలో ఎన్. నటరాజ్, ఆర్డీఓ జాడి రాజేశ్వర్,మునిసిపల్ కమిషనర్ ఏ. శైలజ,మున్సిపల్  వైస్ చైర్మన్ జహీర్ రంజాని, డిఎస్పీ ఎన్. వెంకటేశ్వర్ రావు,డి ఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, ఏడిఈ ఎలక్ట్రికల్ డి.ప్రశాంత్ రెడ్డి, హిందు ఉత్సవ్ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న,సనాతన హిందు ఉత్సవ్ సమితి డాక్టర్ ఫ్రఫుల్ వాజే, సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి,బండారి దేవన్న, జిల్లా మాజీ ఎంఐఎం అధ్యక్షుడు సిరాజ్ ఖాద్రి, మౌలానా అక్బర్, మంజూర్,కౌన్సలర్ బండారి సతీష్,పట్టణ సీఐలు పోతారం శ్రీనివాస్, ఎస్.రామకృష్ణ, ఎస్సైలు ఏ హరిబాబు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సయ్యద్ అన్వర్ ఉల్ హాక్, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post