వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

సెప్టెంబర్ 19, 2021ఆదిలాబాదు:-

గణేష్ నవరాత్రులను ఘనంగా సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకొని నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు అన్నారు. ఆదివారం రోజున వినాయక్ చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో హిందూ సమాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, నలభై సంవత్సరాల నుండి ఆదిలాబాద్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని సాంప్రదాయ బద్దంగా నిర్వహించడం జరుగుచున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, 1978 వ సంవత్సరం నుండి ఆదిలాబాద్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. సుమారు 1100 ల వినాయక విగహాలను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, నిమజ్జన కార్యక్రమం అందరి సహకారంతో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. నిమజ్జన కార్యకమానికి ప్రభుత్వ పరంగా బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్వహించక లేక పోయామని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనను అనుసరించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలో 650 విగ్రహాలను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ప్రతి పండగలను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ తరువాత ఆదిలాబాద్ లోనే ఎక్కువ విగ్రహాలను స్టంపించి పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో చేసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. కోవిడ్ కారణంగా పునః ప్రారంభమైన విద్యాలయాలలో విద్యార్థులు మంచి విద్యాభ్యాసం చేసుకునే విధంగా ఆశీర్వదించాలని వినాయకుణ్ణి కోరాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ లో సమైక్యతతో పండగలను నిర్వహించుకోవడం అభినందనీయమని, కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అంతకు ముందు విద్యార్థులచే నృత్యాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వినాయక విగ్రనికి పూజ కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ఎంపీ, కలెక్టర్, ఎస్పీ, పీఠాధిపతి, అదనపు కలెక్టర్, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జంగిలి ఆశన్న, DSP వెంకటేశ్వర్లు, శ్రీరామ చంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post