వినాయక చవితిపండగ , నిమజ్జన ఏర్పాట్లు అధికారుల సమన్వయము తో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు

పత్రిక ప్రకటన                                                                                                    తేది.7-9-2021

జోగులాంబ గద్వాల్ జిల్లా.

వినాయక చవితిపండగ , నిమజ్జన ఏర్పాట్లు అధికారుల సమన్వయము తో  పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

మంగళవారం  కలెక్టరేట్  సమావేశం హాలులో ఈనెల 10వ తేదీన  వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై  ఎస్పి ,ఆర్డీవో, ,ఎస్సి పి జెపి , మున్సిపల్ కమిషనర్, ఇ ఇ  ఆర్ అండ్ బి, జిల్లా ఫిషరీస్ అధికారి, పంచాయతీ రాజ్ ఇంజనీర్, జిల్లా   పంచాయతీ అధికారి, జిల్లా ఫైర్ అధికారి, జిల్లా వైద్యదికారి, ఎస్సి ఎలక్ట్రిసిటీ,  మున్సిపల్ కమీషనర్, ఇ ఇ ఆర్ డబ్ల్యు ఎస్ ఇంట్రా, తహసిల్దార్లు గద్వాల్ ఇటిక్యాల్  విద్యుత్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో ఆమె మాట్లాడుతూ, అందరం కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. జిల్లా లో బీచుపల్లి, నది అగ్రహారం,ఆలంపూర్ తుంగబద్ర , సుంకేశుల, నదుల దగ్గర  నిమజ్జనం చేయుటకు  ఏర్పాట్లు  చేయాలనీ, నీటిలో  విగ్రహాలు ఎక్కడి వరకు రావాలి, ఎక్కడి వరకు రాకూడదు అనేది గుర్తించి బారికేడ్లు  ఏర్పాటు చేసి, పబ్లిక్ వెళ్ళకుండా  చేయాలని, ముఖ్యంగా బీడుపల్లి ,నది అగ్రహారం  వద్ద సిబ్బందితోపాటు లైటింగ్ మరియు శానిటేష న్  ,బారికేడ్లు, ఏర్పాటు చేయాలనీ మునిసిపల్ కమిషనర్ కు ఆదేశించారు.  . మత్స్యశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని  తెలిపారు. నిమజ్జనం కోసం పంచాయతీ, మున్సిపాలిటీ రోడ్లు బాగు చేయాలని ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులకు సూచించారు. త్రాగు నీటి కి అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు., ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు., పవర్ ఇబ్బంది లేకుండా  లూజు వైర్లను గమనించి వెంటనే బాగు చేయాలని విద్యుత్ శాఖ అధికారి కి సూచించారు. నిమజ్జనం రోజున బీచుపల్లి , నది అగ్రహారం వద్ద మెడికల్ అధికారులు,  అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని వైద్యశాఖకు సూచించారు. బీచుపల్లి  నది దగ్గరలో క్రేన్స్ ఏర్పాటుచేయాలని పి జెపి ఇ ఇ కి ఆదేశించారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలని ఫైర్ అధికారికి సూచించారు. జిల్లా లో వైన్స్ షాప్స్ అన్నియు  క్లోజ్ చేయాలనీ  తెలిపారు. గ్రామాలలో గణేష్ నిమ్మజన కార్యక్రమాన్ని పంచాయతి కార్యదర్శులు చూడాలని ,లైన్ డిపార్ట్మెంట్స్  కోఆర్డినేషన్ తో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమ్మజ్జనం జరిగెలా చూడాలని   కోరారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రంజన్ రతన్ కుమార్  మాట్లాడుతూ , గణేష నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా  పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సన్నద్థంగా ఉన్నామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.  అలాగే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, విగ్రహం సైజు వివరాలను ఇవ్వాలని, , అలాగే నిమజ్జనం చేసే వాహనం నెంబరు వివరాలు ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గణేష్ విగ్రహాల వద్ద, శోభాయాత్ర సమయంలో డిజె సౌండ్ సిస్టంకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజే పర్మిషన్ లేదని అన్నారు. కోవిద్  నిబంధనలను మన బాధ్యత గా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు.

సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ రఘురామ్ శర్మ, ,ఆర్డీవో రాములు , జిల్లా అధికారులు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————————-

…..జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే  జారీ చేయబడినది.

Share This Post