వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—-1
ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించాలి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
విగ్రహాల ఏర్పాటు సమాచారం తప్పనిసరిగా అందించాలి
వినాయక నిమజ్జనం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం తదితర అంశాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్ద పల్లి, సెప్టెంబరు 7:- ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించడానికి
సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాటు పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు, అన్నీ గణేష్ మండలాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్క కరోనా కేసు కూడా రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్ని కలెక్టర్ కోరారు పట్టణంలోని రోడ్ల తాత్కాలిక మరమ్మతు, విద్యుత్తు సరఫరా పనులు పూర్తి చేస్తామని తెలిపారు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా అందరూ పండుగ అనుభూతి పొందాలన్నారు. గణేష్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా అందరూ గణేష్ మండలి నిర్వాహకుల పూర్తి వివరాలు అందించాలని కోరారు. ప్రతి మండపం యొక్క సమాచారం తప్పనిసరి అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు వర్షాలు కురుస్తుండడంతో మండళ్ళ వద్ద చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రసాదాలు, జాగ్రత్తగా స్వీకరించాలని , ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, గణేష్ మండలి వద్ద శానిటేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు, మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రణాళికాబద్దంగా గణేష్ నిమజ్జనం ఏర్పాటు చేయాలి
వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే వెంటనే 100 కు సమాచారం అందించాలని అన్నారు. విఘ్నేశ్వర నిమజ్జనానికి మంచి నీరు , విద్యుత్ , పారిశుధ్యం , మెడికల్ ,లైటింగ్ వంటి సౌకర్యాలు వుండేల చూడాలని అన్నారు. గణేష్ నవరాత్రుల ముగించి నిమజ్జనం చేసే సందర్భంలో అగ్ని మాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అందుబాటులొ వుండాలని కలెక్టర్ తెలిపారు. వినాయక నిమజ్జనం కొరకు వాహనాలకు ఇబ్బందులు కల్గకుండా రోడ్ల పై ఉన్న గుంతలను పుడ్చాలని , వినాయక నిమజ్జనం సమయం లో విగ్రహాలు సీరియల్ నెంబర్ గా రూట్ మ్యాప్ కేటాయించాలని , నిమజ్జన ప్రదేశాలో గతంలో కంటే అధిక సంఖ్యలో గజ్జ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని జిల్లా మత్స్య అధికారికి కలెక్టర్ సూచించారు. వినాయక నిమజ్జన స్థలాల వద్ద బారి క్రేన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, ప్రతి నిమజ్జన స్థలం వద్ద అదనపు ట్రాన్స్ పారంలు, పవర్ జేనరేటర్లను ముందు జాగ్రత్త కింద అందుబాటులో ఉంచాలని , వినాయక నిమజ్జన సమయంలో విద్యత్ తీగల సమస్య ఉత్పనం కాకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ డీఈని ఆదేశించారు. నిమజ్జనం చేసే ప్రదేశాలలో అవసరం మేరకు భ్యారీ కేడ్లు ఏర్పాటు చేయాలని ఈఈ ఆర్ అండ్ బీ ని కలెక్టర్ ఆదేశించారు. వినాయక నిమజ్జన ప్రదేశాలలో వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.వినాయక ఉత్సవాలు, నిమజ్జనం సదర్బంగా అన్నీ గ్రామాలలో అవసరమైన పారిశుద్ద్య పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను సమకూర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 అదనపు కలెక్టర్  లక్ష్మీ నారాయణ, పెద్దపల్లి డిసిపి రవీందర్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, స్పెషల్ డీప్యూటి కలెక్టర్ సింగరేణి నర్సింహమూర్తి, కలెక్టరేట్ సూపరెండేంట్ రవిందర్, జిల్లా అధికారులు   గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు,  సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమిక్షలో పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post