వినాయక చవితి పండగను శాంతి యుతంగా సహృభావ వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన.
నారాయణపేట జిల్లా లో వినాయకచవితి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని పేరు ఉన్నది. ఇట్టి పండగను సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా లో వినాయక చతుర్థి నుండి నిమజ్జనం అయ్యే వరకు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ నిమాజనానికి కావలసిన ఏర్పాట్లను సకాలం లో పూర్తి చేయాలని, సంబందితాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడైనా విద్యుత్ తీగలు కిందికి ఉంటే వాటిని సరి చేయాలన్నారు. నిమజ్జనం ప్రయాణం సమయంలో ఆటంకాలు ఏర్పడకుండా రోడ్ల మరమ్మత్తు పనులను చేపట్టాలన్నారు. నిమజ్జన సమయం లో చెరువుల దగ్గర విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద వినాయకులు ఉంటే వాటికి క్రేన్ సహాయం తో వాటిని నిమజ్జనం చేసేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం రోజున అన్ని మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. నిమాజన సమయం లో స్వచ్చంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నిర్వహించే పరిసరాలను శుభ్రం గా ఉంచాలని అన్నదాన కార్యక్రమం అనంతరం కూడా వాటిని పరిశుభ్రపరిచేటట్లు చర్యలు చేపటట్లు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా లో గత సంవత్సరం జిల్లా లో 1275 వినాయకుల ప్రతిష్ఠించడం జరిగిందని ఈ సంవత్సరం 31వ తేది రోజు వినాయకుల ప్రతిష్టించడం జరుగుతుందని వివిధ తేదీలలో గ్రామ లలో మున్సిపాలిటీ పరిధిలో నిమజ్జనం చేసుకొవడం జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 8, 9వ తేది లలో నిమాజన శోభాయాత్ర మొదలు అయి 10వ తేది నాడు అన్ని వినాయకులను సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం ముగించాలని నిర్వాహకులకు ఆదేశించారు. వినాయక మండపాల దగ్గర ఉదయం 6గం౹౹ లకు మైక్ లను ప్రారంభించుకోవచని, రాత్రి సమయం లో 10గం౹౹ వరకు మైక్ లను ఆఫ్ చేయాలని సూచించారు. అందరి సహకారం తో వినాయక చవతిని మరియు నిమాజనాన్ని వైభవంగా నిర్వహించుకుందమన్నారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ రమంచందర్ నాయక్, డీఎస్పీ సత్యనారాయణ, CI శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు గోవిందా రాజన్,నరేందర్, AO నర్సింగ్ రావు, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్ పర్సన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కరకుమారి, శాంతి కమిటీ సభ్యులు నాగురవు నమాజి, అమీరొద్దీన్, విద్యాసాగర్, చెన్నారెడ్డి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు తాటి నర్సాప్ప , MIM జిల్లా అధ్యక్షులు మొహ్మద్ అబ్దుల్ ఖదీర్, రవి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.