పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 9:–
వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించుకొని భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు.
విగ్నేశ్వరుని కృపతో విఘ్నలన్ని తొలగి అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ఆనందోత్సాహలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.