వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు – కలెక్టర్

సెప్టెంబర్ 18:—

ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.

శనివారం సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జి పై గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 19వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి బాసరకు తీసుకుని వచ్చే వినాయకుల విగ్రహాలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అందుకు అనుగుణంగా పనులు కూడా పూర్తి అవుతున్నాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే బారికేడ్లు, తాగునీరు, మెడికల్ క్యాంప్, లైటింగ్, క్రేన్ ల ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. నిమజ్జ నానికి విగ్రహాలతో వచ్చినవారు వాటిని ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు జరగకుండా నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. గజ ఈతగాళ్ళను నియమించామని, 6 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది అయినా అధికారుల దృష్టికి తీసుకురావాలని, పోలీసు అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున బాసర అ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అనుకునే భక్తులు ఆలోచించుకోవాలని వీలైతే ఆదివారం ప్రయాణం వాయిదా వేసుకొని మరో రోజు దర్శనానికి ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని లేదా వేరే రూట్లో వస్తే ఇబ్బందులు కలగకపోవచ్చునని సూచించారు.

సిపి కార్తికేయ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 19వ తేదీ నుండి వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం బాసర గోదావరి నదిలో నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చేయడం జరిగిందని ఎప్పటి లాగానే నిమజ్జనం రోజు అయిన ఆదివారం నాడు బాసర నుండి నిజామాబాద్ కు వన్ వే పెడుతున్నాం అన్నారు. గత సంవత్సరం లాగానే బందోబస్తు చేస్తామని , ప్రతి ఒక్కరు సహకరిస్తే గణేష్ నిమజ్జనం విజయవంతంగా పూర్తి అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎడి/ ఫిషరీస్ ఆంజనేయ స్వామి, ఆర్ డి ఓ రవి, తహసిల్దార్ లత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ , డి ఎల్ పి ఓ నాగరాజ్ , విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post