వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::జిల్లా కలెక్టర్ బి. గోపి

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు. బుధవారం సాయంత్రం కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి, మున్సిపల్ కమిషనర్ నగరంలోని వినాయక నిమజ్జన కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులు స్వయంగా చెరువులను పరిశీలించారు.

అక్కడ చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు రోడ్డు లోని కోట చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డేపల్లి చెరువు, గొర్రెకుంట వద్ద గల కట్టమల్లన్న చెరువు, మామునూర్ రోడ్డు లోని బెస్తం చెరువు, ఖమ్మం బైపాస్ రోడ్డు లోగల ఉరుసు గుట్ట చెరువు లను పరిశీలించిన అధికారులు అన్ని చెరువుల వద్ద గల పిచ్చి మొక్కలను శుభ్రపరచాలి అలాగే వాహనాల రాకపోకలు సవ్యంగా జరిగేటట్లు గా రోడ్లను శుభ్రం చేయాలని అన్ని చెరువుల వద్ద క్రైన్స్ ,పడవలు, గజ ఈతగాళ్లు, రిస్కీ టీమ్స్, ఏర్పాటు చేయాలని అన్ని ట్యాంకుల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అంబులెన్సులు కూడా అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బంది నిరంతరం వారి సేవలను అందించాలని కలెక్టర్, సిపి లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్, డిప్యూటీ సి పి వెంకట లక్ష్మి , పుష్ప రెడ్డి, ఆర్డిఓ మహేందర్ జి ,మరియు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post