వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 20: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య సోమవారం 30 వ వార్డు కూడలిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి, వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బి. శ్రీనివాస్, కలెక్టర్ ను శాలువాతో సన్మానించి, మెమోంటో అందజేశారు. అనంతరం కూడలిలో కలెక్టర్ మొక్క నాటారు.
ఈ సందర్భంగా జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, అధికారులు తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీచేయనైనది.

Share This Post