వినియోగదారుడు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుడా… నీ హక్కులు తెలుసుకో అనే అంశంపై జిల్లా అధికారులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగస్వాములైన వ్యక్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసేటపుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని చెప్పారు. వస్తువు నాణ్యతలో కానీ, తూకంలో కానీ వ్యత్యాసం ఉంటే తక్షణమే ంబంధిత శాఖ అధికారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వ్యాపారులు దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాలు వినియోగిస్తున్నారని, తూకంలో తేడా ఉన్నట్లయితే తక్షణమే తూకపు బాటుతో పరిశీలన చేసుకుని సమస్యను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. వినియోగదారుడు మోసపోయానని గుర్తించిన పక్షంలో కొనుగోలు చేయబడిన బిల్లును జతచేస్తూ వినియోగదారుల ఫోరంలో దరఖాస్తు చేయాలని, విచారణ నిర్వహించి పరిహారం అందించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆన్లైన్లో జరిగిన మోసాలను సైతం వినియోగదారుల ఫోరం ద్వారా పరిహారం పొందడానికి అవకాశం ఉన్నదని, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చైతన్యం వల్లనే మోసాలను, హక్కులను వినియోగదారుడు తెలుసుకోగలడని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగదారుల హక్కులు బాధ్యతలు గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. వినియోగదారుని యొక్క హక్కులు, నష్టం జరిగినప్పుడు పరిహారం పొందే అంశాలపై అధికారులు, వినియోగదారుల సంక్షేమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. మోసాలు, దగాలను అరికట్టేందుకు మానవతాదృక్పదంతో పనిచేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. వినియోగదారునికి నష్టం జరిగితే బాద్యతగా వారికి అండగా ఉండి పరిహారం లభించు విధంగా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వస్తువు బిల్లులు ఉంటేనే పరిహారం పొందడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువుకు బిల్లు తీసుకుని బాధ్యతగా బద్రపరచాలని చెప్పారు. వినియోగదారునికి అన్యాయం జరిగినపుడు వారి పక్షాన ఉండి సేవలందిస్తున్న వినియోగదారుల పరిరక్షణ సంఘ సభ్యుల సేవలను అదనపు కలెక్టర్ అభినందించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగస్వాములైన జూలూరి రఘుమాచారి, కూరాకుల శ్రీధర్, అడపాల పార్వతి, గుగులోతు బాలు, మహ్మద్ రియాజ్, రామచంద్రయ్యలు మాట్లాడుతూ సరైన ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువు వినియోగదారుల చట్టపరిధిలోకి వస్తుందని చెప్పారు. పరిహారం పొందేందుకు వినియోగదారుడు చైతన్యం కావాలని చెప్పారు. నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం వర్తిస్తుందని చెప్పారు. పెట్రోల్ బంకులు, హెూటళ్లులో నిరంతర తనిఖీలు చేపట్టాలని కోరారు. మద్యం కల్తీలు జరుగుతున్నాయని, నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్ విక్రయాలను నియంత్రణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డియం ప్రసాద్, తూనికలు కొలతల అధికారి మనోహర్, ఔషధ అధికారి బాలక్రిష్ణ, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి పల్లబోతు సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

Share This Post