వినియోగదారులు గ్యారెంటీ, వారంటీ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వినియోగదారుడు వస్తువులు తీసుకున్న తర్వాత బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వస్తువులను చూసుకొని విక్రయించే వ్యాపారి వద్ద పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కళాశాలల విద్యార్థులకు వినియోగదారుల హక్కుల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం జిల్లా అధ్యక్షురాలు సువర్ణ మాట్లాడారు. వైద్యాధికారి రాసిచ్చిన మందుల చిట్టిని తీసుకుని మెడికల్ కి వెళ్లి వినియోగదారుడు తనకు కావాల్సిన మందులు తీసుకొని డబ్బులు చెల్లించి బిల్లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. వినియోగదారులు డిస్కౌంట్ ఆఫర్లు చూసి మోసపోవద్దని కోరారు. వస్తువుల నాణ్యత ను పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ జితేంద్ర ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్, ఆర్టీవో వాణి, జిల్లా వ్యవసాయ అధికారి ని భాగ్యలక్ష్మి, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ,జిల్లా వినియోగదారుల పరిరక్షణ చట్టం గౌరవ అధ్యక్షులు నారాయణ, అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post