వినియోగదారులు పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి…. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్.

వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019 పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో రేషన్ డీలర్లు, వినియోగదారులు, రెవిన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, పౌరులు మోసపోకుండ కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు సేవా సంస్థల నుండి తగిన రసీదు, ధ్రువపత్రాలు తీసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణములకు వచ్చే వినియోగదారులకు డీలర్లు వారి హక్కులపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి పౌరునికి భద్రత హక్కు, ప్రాథమిక అవసరాలు పొందే హక్కు, సమాచారం తెలుసుకొనే హక్కు, పరిహారం పొందే హక్కులు ఉంటాయని తెలిపారు. ఇట్టి హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. వినియోగదారుడు ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత లేనప్పుడు పరిష్కారం కొసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసి సత్వర పరిష్కారం పొందవచ్చాన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు.

Share This Post