వినియోగదారుల సమాచార కేంద్రం ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ కొమురయ్య

ప్రచురణార్ధం

వినియోగదారుల సమాచార కేంద్రం ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ కొమురయ్య

మహబూబాబాద్, ఆగస్ట్-06:
ప్రతి వినియోగదారుడు తాను కొన్న వస్తువు కు సంభందించి మోసపోయిన సందర్భంలో వినియోగదారుల సమాచార కేంద్రంలో సమస్యను తెలిపి సమస్యకు పరిష్కారం పొందాలని జిల్లా  అదనపు కలెక్టర్ కొమురయ్య తెలిపారు.  శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సివిల్ supply కార్యాలయం పై ఏర్పాటు చేసిన వినియోగదారుల సమాచార కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ, కొనుగోలు చేసినప్పుడు కొన్న వస్తువుకు సంభందించిన bill పొందాలని, అప్పుడే ఆ వస్తువు పై పూర్థి రక్షణ పొందవచ్చని తెలిపారు.  వినియోగదారుల హక్కుల పరిరక్షణకై కృషి చేయాలని తెలిపారు. 
బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీ, జీవిత భీమా సంస్థ, రైల్వే, airlines, ట్రాన్స్ పోర్ట్ సర్వీస్, కొరియర్, విద్యుచ్చక్తి, హౌసింగ్ బోర్డు, టెలిఫోన్, క్లినికల్ లాబొరేటరిలు, ప్రైవేటు ఆసుపత్రులు, గ్యాస్ కంపెనీలు, యూనివర్శిటీలు మొదలైన సేవలలో గల లోపాల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.  ఫిర్యాదుదారుడు వస్తువు కొన్నప్పుడు బిల్లును తీసుకొని వస్తువు లోపమ్ తలగించమని, మరల క్రొత్త వస్తువు ఇవ్వమని, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరవచ్చని తెలిపారు.  వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సమాచార కేంద్రంలో తమ సమస్యను వివరించి పరిష్కారం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, సమాచార కేంద్రం చైర్మన్ డాక్టర్ వింజమూరి సుధాకర్, వినియోగదారుల సంఘాల సమాఖ్య నాయకులు మైసశ్రీనివాస్, తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలకుంట్ల శ్రీనివాస్, డాక్టర్ అశోక్ శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post