విపత్కర పరిస్థితుల్లో సమైక్యంగా సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా  కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సర్దార్ వల్ల బాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని  ఆదివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఎస్పీ సునీల్ దత్ కలిసి ఆయన చిత్ర  పటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ భారత దేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత  దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోష మని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశ తొలి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా దేశాన్ని ఐక్యంగా నడిపించారని చెప్పారు.  మనందరిలో సమైక్య స్ఫూర్తి నింపారన్నారన్నారు.   భాగ్యనగరాన్ని నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుండి విముక్తి చేసిన ఉక్కు మనిషి ఆయన అని ఒక్క భాగ్యనగరాన్నే కాకుండా అనేక సంస్థానాలను భారత్ లో విలీనం చేశారన్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, భారతదేశాన్ని, దాని పటాన్ని పరిపూర్ణం చేయడంలో తన వంతు కృషి చేశాడన్నారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి మనందరం అంకితమవుదామని ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన  దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్య నిష్టతో తీర్మానం చేస్తున్నానని,  అందరితో ప్రతిజ్ఞ చేయించారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఏవో గన్యా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post