పత్రికా ప్రకటన
తేదీ 21.01.2023.
నాగర్ కర్నూల్.
విముక్త జాతులు, సంచార జాతులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే సామాజిక ఆర్థిక అసమానతలు తొలుగుతాయి – విముక్త సంచార జాతుల కేంద్ర సంరక్షణ బోర్డు సభ్యుడు తురక నర్సింహ
దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని వీటిని తొలగించడానికి అణగారిన విముక్త సంచార జాతుల పిల్లలకు మెరుగైన విద్యా ప్రమాణాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాల్సి ఉంటుందని విముక్త సంచార జాతుల కేంద్ర సంరక్షణ దక్షిణ భారతదేశ సభ్యుడు తురక నర్సింహా సూచించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విముక్త సంచార జాతుల ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏ జాతులు తెగల వారు ఉన్నారు, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారికి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన అసైన్డ్ భూములు ఎంత అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, ఎంత మంది కబ్జాలో ఉన్నారు అనే పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను అదేధించారు.
సంచార జాతులను ఆదుకుంటామని సంచార జాతులైన సింధు, బుడగ జంగాలు, వడ్డెర, దొమ్మరి, మేదరి, బుడుగబుడకలకు చెందిన వారు వివిధ గ్రామాల్లో సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం కోసమే తారు పర్యటిస్తున్నట్లు తెలిపారు.
సంచార జాతుల జీవన పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ కులాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో కేంద్రానికి నివేదిస్తామన్నారు. సంచార కులాల్లో ఎస్సీ, బీసీలే ఎక్కువగా ఉన్నాయన్నారు. సంచార జాతుల్లో కళాకారులు, కళా పోషకులను తాము గుర్తించినట్లు తెలిపారు. సంచార జాతుల కళాకారుల అభివృద్ధికి వివిధ పార్టీల నాయకుల సలహాలు ఇచ్చి వీరి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
ఉపాధ్యాయులతో ఆయన గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ సబ్జెక్టులపై ఇంట్రాక్ట్ అవుతూ జాతీయ విద్యా విధానంలో మార్పులు చేర్పులకు సబ్జెక్టుల వారిగా సలహాలు సూచనలు అందించాలని కోరారు.
ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉంటూ తరగతి గదిలో విద్యార్థులు ప్రశ్నలు అడిగేటట్లు చేయాలన్నారు.
భారత దేశ చరిత్ర నాగరికత చాలా గొప్పది అని ప్రతి విద్యార్థికి చరిత్ర తెలిసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
దేశ చరిత్రను ప్రతిబింబించే షీలా కట్టడాలను చూపించి దేశంపై ప్రేమ మక్కువను పెంచాలన్నారు.
ఉపాధ్యాయులకు విద్యార్థుల దిశను మార్చే శక్తి ఉంటుందన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, జిసిసి మేనేజర్ సంతోష్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, డిఈఓ గోవిందరాజులు, డిపిఓ కృష్ణ, డీఎంహెచ్వో సుధాకర్ లాల్, డిపిఆర్ఓ సీతారాం, ఏసీ రాజశేఖర్ రావు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజ్, సెక్టోరియల్ అధికారులు సూర్యచైతన్య, బరపట్టి వెంకటయ్య, సతీష్ కుమార్, మండల విద్యాధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
………………………….. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ద్వారా జారీ చేయడం అయినది.