విలేజి లెవల్ మల్టీ డిసిప్లినరీ టీములతో ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

విలేజి లెవల్ మల్టీ డిసిప్లినరీ టీములతో ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వైద్య అధికారులు, జిల్లా పరిషత్ సీఈవో లు, జిల్లా పంచాయతీ అధికారులతో జిల్లాల వారిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఆశా,  అంగన్వాడి, పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఏ,  రేషన్ షాప్ డీలర్లతో కూడిన విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లినరీ టీములు స్పెషలాఫీసర్ల పర్యవేక్షణలో ప్రతి ఇల్లు సర్వే చేసి వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని, సర్వేలో ఎవరు మొదటి డోస్ తీసుకున్నారు, ఎవరు రెండవ డోస్ తీసుకున్నారు,  ఎవరు అసలే వాక్సిన్ తీసుకోలేదు అనే వివరాలను సేకరించాలని, వాక్సిన్  కార్యక్రమాన్ని 100 శాతం నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల 60 లక్షల మందికి లక్ష్యానికి గాను 3 కోట్ల 5 లక్షల మందికి వాక్సిన్ వేశామని,  100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రోజు వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డి. హరిచందన, అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి,  వైద్య అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Share This Post