వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని విద్యార్తులకు ఓపెన్ స్కూల్ ఒక వరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని విద్యార్తులకు  ఓపెన్ స్కూల్ ఒక వరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కల్లెకర్ చాంబర్ నందు విద్యా శాఖ ఓపెన్ స్కూల్ సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్ చదువుకునే విద్యార్థులకై రూపొందించిన ఓపెన్ స్కూల్ విధానం ద్వారా విద్యావంతులు కావచ్చు అని కలెక్టర్ తెలిపారు. డీఈవో సిరాజుద్దీన్ మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్లో చేర్చి పరీక్షలు రాసేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, అక్టోబర్ 10వ తేదీ వరకు అపరాధ రుసుముతో ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్స్ శ్రీనివాసులు డిసిఇబి ప్రతాపరెడ్డి, వెంకటేశ్వరరావు  నరేందర్ తదితరులు ఉన్నారు.

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడినది

 

 

 

 

 

Share This Post