వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులకు సత్వరమే చెల్లింపులు చేయాలి : జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

తేదీ.06.11.2021.
సూర్యాపేట.

చేపట్టిన పనులకు చెల్లింపులు సత్వరమే చేయాలి.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులకు సత్వరమే చెల్లింపులు చేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభివృద్ది పనుల పురోగతి, చెల్లింపులు పై జిల్లా అదికారులు, యం.పి.డి. ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సి.డి.పి., యం.పి.ల్యాడ్స్, సి.డి.యాప్. సి.బి.యాప్., డి.యం.యాప్.టి. నిధుల ద్వారా జిల్లాలో అనేక అభివృద్ది పనులకు నిధులు కేటాయించి, అనుమతులు ఇచ్చామని ఐ నప్పటికీ సకాలంలో పనుల నిర్వహణ జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, అలాగే పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే అదికారులు, గుత్తేదారుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా చేపట్టిన పనుల పై అధికారులతో కలసి సమీక్షించారు.

ఈ సమావేశంలో సి.పి. ఓ వెంకటేశ్వర్లు, ఈ.ఈ. యాకూబ్, వివిధ శాఖల అధికారులు, యం.పి.డి. ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post